దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు మరోసారి ప్రజలను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అందరి మాదిరిగా తాను సాధారణంగా ఓట్లు అభ్యర్థిస్తే కిక్కేముంటుందని అనుకున్నాడో ఏమో కర్ణాటక మంత్రిగారు. తన ప్రచారాన్ని వినూత్స నడిరోడ్డుపై బ్యాండ్ చప్పుళ్ల ముందు నాగిని డ్యాన్స్ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపర్చడమే కాదు మీడియా దృష్టిని కూడా ఆకర్షించి మంచి పబ్లిసిటీ పొందారు. 

కర్ణాటకలో అధికారంలో వున్న మిత్రపక్షాలు జెడిఎస్-కాంగ్రెస్ పార్టీలకు బిజెపి కి హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో గత లోక్ సభ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన జేడిఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈసారి ఎలాగైనా బిజెపి జోరును అడ్డుకోవాలని చూస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలందరు ప్రచారంలో మునిగిపోయారు. ఇలా బెంగళూరు రూరల్ జిల్లా హోస్పెటలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎంటీబీ నాగ్ రాజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో స్ధానిక నాయకులతో కలిసి ఆయన బ్యాండ్ చప్పుడుకు డ్యాన్స్ చేశారు. ఇలా మంత్రి నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్ చేస్తూ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. అయితే మంత్రిగారి ఈ డ్యాన్స్ సోషల్ మీడియాకు ఎక్కడం...నెటిజన్లకు అది విపరీతంగా నచ్చడంతో కొద్ది గంటల్లోనే వైరల్ వీడియోల జాబితాలో చేరింది. 

మంత్రి నాగరాజ్ నాగిని డ్యాన్స్ వీడియో