దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, వారి సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతుండటం రాజకీయంగా పెద్ద కలకలాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై మండిపడుతుండగా.. కమల్ హాసన్ మాత్రం వీటికి మద్ధతు పలికారు.

ప్రజాధనాన్ని దోచుకుని, దాచుకున్న వారికి శిక్ష విధించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికల  సమయంలోనే కాకుండా ఇంతకు ముందు కూడా సోదాలు  జరిగాయి కదా అని ఆయన గుర్తు చేశారు. మరోవైపు మక్కల్ నీది మయ్యం పార్టీ అభ్యర్థుల తరపున కమల్ హాసన్ ప్రచారం చేశారు. ఆదివారం కోయంబత్తూరు, పొల్లాచ్చిలో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు.