సినీనటి జయప్రద.. బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఒకప్పుడు సినీ తారగా ఒక వెలుగు వెలిగిన జయప్రద.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సమాజ్ వాద్ పార్టీలో కొనసాగిన ఆమె.. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఈ క్రమంలో త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆమె కషాయ కండువా  కప్పుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆమె బీజేపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. సోమవారం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

పార్టీలో చేరడంతోపాటు ఉత్తరప్రదేశ్ లోని రామ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానం నుంచి ఎస్పీ(సమాజ్ వాద్ పార్టీ) నుంచి అజమ్ ఖాన్ పోటీకి దిగుతున్నారు.

అజమ్ ఖాన్.. జయప్రద రాజకీయ ప్రత్యర్థులు అన్న విషయం తెలిసిందే. దీంతో.. ఆమె తన ప్రత్యర్థిపై పోటీకి దిగి విజయం సాధించాలని తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఈ విషయంపై స్పష్టత రానుంది.