Asianet News TeluguAsianet News Telugu

విద్యార్హత వివాదంలో స్మృతి ఇరానీ

కేంద్ర స్మృతి ఇరానీ విద్యార్హతపై మరోసారి విదానం నెలకొంది. గత ఎన్నికల సమయంలో తాను డిగ్రీ పట్టా పొందినట్టు,  బీకాం కోసం ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాని చెప్పారు. 

In election affidavit, Smriti Irani says she is not a graduate
Author
Hyderabad, First Published Apr 12, 2019, 1:46 PM IST


కేంద్ర స్మృతి ఇరానీ విద్యార్హతపై మరోసారి విదానం నెలకొంది. గత ఎన్నికల సమయంలో తాను డిగ్రీ పట్టా పొందినట్టు,  బీకాం కోసం ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాని చెప్పారు. కాగా.. ఈ ఎన్నికల అఫిడవిట్ తాను గ్యాడ్యుయేషన్ చేయలేదని పేర్కొన్నారు. దీంతో.. ఆమె విద్యార్హత మరోసారి చర్చనీయాంశమైంది.

అమేథి నియోజకవర్గం నుంచి తాజాగా స్మృతి నామినేషన్ దాఖలు  చేశారు. కాగా అఫిడవిట్ లో 1991లో ఆల్ ఇండియన్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్(పదో తరగతి), 1993లో ఆల్ ఇండియన్ సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(ఇంటర్) ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె వెల్లడించారు. 

ఇంత వరకు ఓకే కానీ.. ఆమె డిగ్రీ విషయంలోనే మూడు సార్లు మూడు రకాలుగా చెప్పుకొచ్చారు. నిన్న దాఖలు చేసిన ఆఫిడవిట్‌లో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో దూర విద్యలో బ్యాచిలర్ కామర్స్ పార్ట్ 1 మాత్రమే చదివానని, డిగ్రీ మొత్తం పూర్తి చేయలేదని పేర్కొన్నారు. 

అయితే 2004 ఎన్నికలప్పుడు స్మృతి ఇరానీ 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు పేర్కొన్నారు. 2014 ఎన్నికల ఆఫిడవిట్‌లో బీకామ్ కోసం 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. 

అంతే కాదు.. 2014 ఆగస్టులో ఓ మీడియా సమావేశంలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. యూఎస్‌లోని ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినట్లు చెప్పారు. దీంతో అప్పట్లో స్మృతి విద్యార్హతలపై విపక్షాలు ఘాటుగా స్పందించాయి. మరి ఇప్పుడేలా స్పందిస్తాయో వేచి చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios