ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ తరపు నుంచి ఎన్నికల్లో పోటీ కూడా చేస్తున్నారు. కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌, తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆతిషీపై అశ్లీ క‌ర‌ప‌త్రాల‌ను గౌతం గంభీర్ రిలీజ్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. ఈ ఆరోపణలపై హర్భజన్ సింగ్ స్పందించాడు.

అయితే గౌత‌మ్ గంభీర్ అలాంటి వాడు కాదు అని మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ అన్నాడు. ఇవాళ ట్విట్ట‌ర్ ద్వారా భ‌జ్జీ స్పందించాడు. ఓ మ‌హిళ ప‌ట్ల మ‌రీ అంత అనుచితంగా గంభీర్ మాట్లాడడు అని  త‌న ట్వీట్‌లో తెలిపాడు. 

‘‘గంభీర్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు విని షాక‌య్యాను, అత‌ని గురించి నాకు బాగా తెలుసు, మ‌హిళ‌ల ప‌ట్ల అత‌ను అలాంటి నీచ వ్యాఖ్య‌లు చేయ‌డు, అత‌ను ఎన్నిక‌ల్లో గెలుస్తాడా లేదా అన్నది అప్ర‌స్తుతం, కానీ అత‌ను మంచి వ్య‌క్తి ’’అని హ‌ర్భ‌జ‌న్ ట్వీట్ చేశాడు.