అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో  గురువారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు.

ఒంగోలు ఎంపీ స్థానం నుండి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని బరిలోకి దింపాలని చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయమై మాగుంట శ్రీనివాసులు రెడ్డితో చంద్రబాబునాయుడు చర్చించారు.

ఒంగోలు ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని బాబు మరోసారి మాగుంటను కోరారు. అయితే ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు మాగుంట ఆసక్తిని కనబర్చలేదు.

ఒంగోలు పార్లమెంట్  స్థానం సమీక్ష సందర్భంగా కూడ పోటీ చేయబోనని  బాబుకు మాగుంట చెప్పారు.  అయితే ఒంగోలు కాకపోతే నెల్లూరు నుండి పోటీ చేయాలని కూడ మాగుంట వద్ద బాబు ప్రతిపాదించారు. 

 కానీ, పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సుముఖంగా లేరు.ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం మాగుంట శ్రీనివాసులు రెడ్డి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో సమావేశమైన విషయం తెలిసిందే.