జిల్లా కలెక్టర్‌పై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఛింద్‌వాడాలో నిర్వహించిన ప్రచార ర్యాలీకి వస్తున్న శివరాజ్ సింగ్‌ను పోలీసులు నిలిపివేశారు.

దీనిపై ప్రశ్నించగా హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతి లేదంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని పోలీసులు తెలిపారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన శివరాజ్‌సింగ్ కలెక్టర్‌పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో మమతా బెనర్జీ హెలికాఫ్టర్ ల్యాండ్ కానివ్వడం లేదు.. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. డియర్ పిట్టూ కలెక్టర్.. జాగ్రత్తగా విను...రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు.. మేము మళ్లీ అధికారంలోకి వస్తాం.. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా.. అంటూ శివరాజ్ వార్నింగ్ ఇచ్చారు.