ప్రధాని నరేంద్రమోడీపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. భారత్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్‌ను ‘‘దీపావళి’ కోసం దాచుకోనప్పుడు పాకిస్తాన్ సైతం వాటిని ‘ఈద్’ వరకూ దాచుకోదని ప్రధానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇంతగా దిగజారి ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదని ఆమె మోడీకి చురకలు అంటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ తరచూ న్యూక్లియర్ బెదిరింపులకు పాల్పడుతోందని.. అలా దాడి చేసే పరిస్ధితి వస్తే తాము మాత్రం చూస్తూ ఊరుకుంటామా అని మోడీ ప్రశ్నించారు.

‘‘పాక్ బెదిరింపులకు భయపడిపోయే పాలసీలను భారత్ ఇప్పుడు పక్కనబెట్టిందని.. మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని పాక్ ప్రతీరోజు బెదరిస్తూనే ఉంది.. అయితే మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే, భారత దగ్గర వున్న న్యూక్లియర్ ఆయుధాలను మేము దీపావళీ కోసం దాచుకుంటామా అని మోడీ ప్రశ్నించారు.