లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నెల 9న బీజేపీ అభ్యర్థుల తరపున మహారాష్ట్రలోని లాతూర్‌లో మోడీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ... బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన వారిని తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు ఎన్నుకోవాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని అభ్యంతరం తెలిపుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ అధికారి చంద్ర భూషణ్ కుమార్... ప్రధాని ప్రసంగాన్ని తెప్పించుకున్నామని, దానిని పరిశీలిస్తున్నామని దీనిపై జిల్లా ఎన్నికల అధికారి వివరణను తాము ఇప్పుడే వెల్లడించలేమని చెప్పారు.