Asianet News TeluguAsianet News Telugu

పాతికేళ్ల తర్వాత ఒకే వేదికపై ములాయం-మాయావతి

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. బీఎస్పీ చీఫ్ మాయావతి.. ఈ ఇద్దరు పాతికేళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించనున్నారు. ఒకప్పటి బద్ధ శత్రువులైన వీరిద్దరూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒకే వేధికను పంచుకోవడానికి సిద్ధపడ్డారు.

Election 2019: Mulayam Singh, Mayawati - Enemies For 2 Decades - Together On Stage Today
Author
Hyderabad, First Published Apr 19, 2019, 12:45 PM IST

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. బీఎస్పీ చీఫ్ మాయావతి.. ఈ ఇద్దరు పాతికేళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించనున్నారు. ఒకప్పటి బద్ధ శత్రువులైన వీరిద్దరూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒకే వేధికను పంచుకోవడానికి సిద్ధపడ్డారు.

రెండు దశాబ్దాలుగా  ఈ ఇద్దరు నేతల మధ్య మాటలు లేవు. 1995 తర్వాత వీరిద్దరూ కలిసిన సందర్భాలు కూడా లేవు. కానీ కేంద్రంలోని బీజేపీని ఢీకొట్టేందుకు వీరిద్దరూ ఒక్కటయ్యారు. బీజేపీని ఓడించేందుకు ఆర్ ఎల్డీతో కలిసి మహాకూటమి కట్టిన ఎస్పీ, బీఎస్పీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నాయి. ఈ నెల 23వ తేదీన మూడో విడత ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లో 10 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎస్పీ కంచుకోట అయిన మొయిన్పురిలో కూడా ఈ ఫేజ్ లోనే ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నిక నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై ఉండి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.1993లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేయగా.. సమాజ్‌వాదీ పార్టీ 109, బీఎస్సీ 67 స్థానాల్లో గెలిచాయి. 177 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎస్పీ-బీఎస్పీ పార్టీలు మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఈ క్రమంలో ఎస్పీ-బీఎస్పీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నరు.

దాడి నుంచి తప్పించుకునేందుకు మాయావతి ఓ గదిలోకి వెళ్లి తలుపువేసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన తర్వాత ఇరుపార్టీలు ఎడముఖం పెడముఖంగానే ఉన్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు జతకట్టి బీజేపీని ఢికొడుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios