దేశరాజధాని ఢిల్లీకి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఇటీవల ఓ వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ చెంపను సురేష్ అనే వ్యక్తి పగల కొట్టాడు. కాగా... తాను చేసిన పనికి ఇప్పుడు ఆ వ్యక్తి ప్రశ్చాత్తాప పడుతున్నాడు.

తన వెనుక ఎవరూ లేరనీ... అసలు ఆయనను ఎందుకు కొట్టానో కూడా తనకు తెలియదని పేర్కొన్నాడు. ‘‘ఆయనను ఎందుకు కొట్టానో కూడా నాకు తెలియదు. అలా కొట్టినందుకు చింతిస్తున్నా..’’ అని సురేశ్ పేర్కొన్నాడు. తాను ఏ పార్టీ కోసం పనిచేయడం లేదని చెప్పుకొచ్చాడు.
‘‘నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కేజ్రీవాల్‌ని కొట్టమని ఎవరూ నాతో చెప్పలేదు. అరెస్టు తర్వాత పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టలేదు. నేను తప్పు చేశానని మాత్రమే వారు చెప్పారు. ఇప్పుడు చాలా బాధగా ఉంది కేజ్రీవాల్ ని కొట్టినందుకు..’’ అని సురేశ్ పేర్కొన్నాడు. ఈ నెల 4న వెస్ట్ ఢిల్లీలోని మోతీ నగర్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీవాల్‌పై సురేశ్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సీఎంని ఓ సాధారణ వ్యక్తి కొట్టడంతో ఈ ఘటన వైరల్ అయ్యింది.