Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక ముఖ్యమంత్రినీ వదలని ఈసీ...

ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన కాన్వాయ్ లోని వాహనాలను ఆపడానికే అధికారులు భయపడుతుంటారు. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్నే అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు. సామాన్యుల వాహనం మాదిరిగానే ఆయన కూడా తనిఖీ చేస్తున్న అధికారులకు సహకరించాల్సి వచ్చింది. ఇలా ముఖ్యమంత్రి వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఈసీ ఎంత నిస్పక్షపాతంగా వ్యవహరిస్తుందో భయటపడింది. 

EC stops Karnataka CM Kumaraswamy's  vehicle for checking
Author
Karnataka, First Published Apr 3, 2019, 5:08 PM IST

ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన కాన్వాయ్ లోని వాహనాలను ఆపడానికే అధికారులు భయపడుతుంటారు. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్నే అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు. సామాన్యుల వాహనం మాదిరిగానే ఆయన కూడా తనిఖీ చేస్తున్న అధికారులకు సహకరించాల్సి వచ్చింది. ఇలా ముఖ్యమంత్రి వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఈసీ ఎంత నిస్పక్షపాతంగా వ్యవహరిస్తుందో భయటపడింది. 

లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అక్రమాలు జరక్కుండా ఈసీ దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారీ సంఖ్యలో తాత్కాలిక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి డబ్బు, మద్యం సరఫరా జరక్కుండా వాహనాల తనిఖీ చేపడుతోంది. ఇలా తనిఖీల కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఓ ఈసీ స్క్వాడ్ బృందం కర్ణాటకలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించి శభాష్ అనిపించుకుంటోంది. 

కర్ణాటకలో ఎన్నికల సంఘం అధికారులు బుధవారం హసన్ జిల్లాలో ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. వచ్చి పోయే ఏ వాహనాన్ని వదలకుండా ఆపి అందులో తనిఖీలు చేపడుతున్నారు.  ఈ సమయంలో ముఖ్యమంత్రి కుమార స్వామి కాన్వాయ్ అటువైపు వచ్చింది. దీంతో అధికారులు ఆ వాహనాలను కూడా నిలిపివేశారు. 

వారు నేరుగా కుమార స్వామి వాహసం వద్దకు వెళ్ళి తనిఖీలకు సహకరించాలని కోరారు. సీఎం కూడా అధికారులు సహకరించడంతో ఆయన ప్రయానిస్తున్న కారుతో పాటు మిగతా వాహనాలను కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఎలాంటి అనుమానిత పదార్థాలు, డబ్బు గానీ లేవని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సీఎం కాన్వాయ్ ను అక్కడినుండి పంపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios