మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్... ఈ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. కాగా.. ఈస్ట్ ఢిల్లీ ఎన్నికల బరిలో బీజేపీ తరపు నుంచి పోటీలో నిల్చున్నారు.
మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్... ఈ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. కాగా.. ఈస్ట్ ఢిల్లీ ఎన్నికల బరిలో బీజేపీ తరపు నుంచి పోటీలో నిల్చున్నారు. కాగా... ఆయన పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎన్నికల కమీషన్ పోలీసులను ఆదేశించింది.
ఈస్ట్ ఢిల్లీలో అనుమతి లేకుండానే.. గంభీర్ ర్యాలీ నిర్వహించడాన్ని ఈసీ తప్పుపట్టింది. దీంతో గంభీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈస్ట్ ఢిల్లీ రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల బరి నుంచి గౌతమ్ తప్పించేందుకు కాంగ్రెస్, ఆప్ పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
గౌతమ్ గంభీర్ కి రెండు ఓట్లు ఉన్నాయని.. ఆయనకు ఓట్లు వేయద్దని ఓ వైపు ప్రచారం చేస్తూనే.. మరో వైపు ఆప్ నేతలు ఆయనపై కేసులు కూడా పెడుతున్నారు. ఆయన నామినేషన్ చెల్లకుండా ఉండేందుకు కూడా ప్రయత్నించడం గమనార్హం.
