వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్రమోదీకి పోటీగా... కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుందని అందరూ భావించారు. ఈ విషయంపై పలుమార్లు రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. ఆయన సస్పెన్స్ అన్నారే తప్ప.. విషయం తేల్చలేదు. కాగా.. ఈ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
 
మోదీపై వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ పోటీ చేయనున్నారు.  గత ఎన్నికల్లో కూడా మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసింది అజయ్ రాయ్. అయితే.. ఈ సారి మాత్రం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మస్త్రంగా భావించే ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీచేస్తారనే ప్రచారం జరిగింది.

గురువారం మోదీ ఎన్నికల నామినేషన్ వేయనున్న నేపథ్యంలో.. ఈ రోజే ప్రియాంక పేరు అనౌన్స్ చేస్తారని అందరూ భావించారు. అనూహ్యంగా.. ప్రియాంకను కాదని.. అజయ్ రాయ్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది.