రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు.. గాంధీ-నెహ్రూ కుటుంబానికి వారసుడు. ఎస్పీజీ సెక్యూరిటీ, మందీ మార్భలంతో పాటు అడుగడుగునా నీరాజనాలు.. అలాంటి వ్యక్తి నేలపై పడుకుని హెలికాఫ్టర్ రిపేర్ చేస్తూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన పర్యటనలకు వినియోగిస్తున్న హెలికాఫ్టర్‌లో సమస్య తలెత్తింది. దీంతో సిబ్బంది దానిని సరిచేస్తుండగా.. రాహుల్ గాంధీ కూడా వారికి సహాయం చేశారు. ఏకంగా ఛాపర్ కిందకి దూరి మరి రీపేర్ చేశారు.

ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాహుల్ గాంధీ ‘‘ మంచి టీం వర్క్ అంటే అన్ని చేతులు కలిసి పనిచేయడమే.. ఉనా పర్యటన సమయంలో మా హెలికాఫ్టర్‌లో సమస్య ఎదురైంది.  మేమంతా దానిని త్వరగా సరిచేశాం. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు’’ అని రాహుల్ పోస్ట్ చేశారు.