ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో... యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. సోనియా గాంధీతో చంద్రబాబు ముఖాముఖి కావడం ఇదే తొలిసారి. దీంతో.. వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా... ఈ సమావేశంలో చంద్రబాబు.. ప్రాంతీయ పార్టీల బలాబలాలను సోనియా గాంధీకి వివరించనున్నారు. ఫలితాల అనంతరం వ్యూహాలపై వీరిద్దరూ చర్చించనున్నారు. ఇదే విషయంపై  చంద్రబాబు కొద్ది సేపటి క్రితం  కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే.