Asianet News TeluguAsianet News Telugu

పోలింగ్ ట్రిక్... రూ.2 తగ్గిన పెట్రోల్ ధర

వాహనదారులకు శుభవార్త. పెట్రోల్ ధర ఏకంగా రూ.2 తగ్గింది. అయితే... ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదండోయ్.  కేవలవ మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలోని ఒక పెట్రోల్ బంకులో ఈ డిస్కౌంట్ ధర అందుబాటులో ఉంది. 

Cast vote, get Rs 2 off on petrol at Khandwa fuel station
Author
Hyderabad, First Published May 17, 2019, 1:58 PM IST

వాహనదారులకు శుభవార్త. పెట్రోల్ ధర ఏకంగా రూ.2 తగ్గింది. అయితే... ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదండోయ్.  కేవలవ మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలోని ఒక పెట్రోల్ బంకులో ఈ డిస్కౌంట్ ధర అందుబాటులో ఉంది. అది కూడా అన్ని రోజుల్లో కాదు. కేవలం మే 19న మాత్రమే. 

ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు పెట్రోల్ బంకు యజమాని సిద్ధార్థ్ జైన్ తగ్గింపు ధరతో పెట్రోల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మే 19న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు వారి వేలి సిరా గుర్తను చూపించి ఇండోర్-ఖాండ్వా రోడ్‌లోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించుకోవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios