హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సన్నీడియోల్ తాజా లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ ‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అసలు పేరు చాలా మందికి తెలియదు.

సన్నిడియోల్ అసలు పేరు  అజయ్ సింగ్. ఎన్నికల్లో ఆయన తన అసలు పేరుతో పోటీ చేస్తున్నారు. దీంతో ఈ అజయ్ సింగ్ ఎవరా అని అక్కడి జనం ఆశ్చర్యపోతున్నారు. ధర్మేంద్ర తనయుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీడియోల్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు.

బీజేపీలో చేరిన వెంటనే ఆయనకు గురుదాస్‌పూర్ టికెట్ కేటాయించింది. దీంతో నామినేషన్ సైతం దాఖలు చేశాడు. తన పేరును అజయ్ సింగ్ ధర్మేందర్ డియోల్ అని అఫిడవిట్‌‌లో పొందుపరిచారు.

ఇప్పుడు అదే పేరు ఈవీఎంపై కనిపించనుంది. ఇదే ఇప్పుడు సన్నీకి కష్టాలు తెచ్చిపెట్టింది. అజయ్ సింగ్ ధర్మేందర్ డియోల్ అంటే ఎవరికి తెలియదు.. దీంతో తనకు జనం ఓటు వేస్తారా అని ఆయన ఆందోళనకు గురవుతున్నారు.

దీనిని గ్రహించిన బీజేపీ వెంటనే నష్టనివారణా  చర్యలు ప్రారంభించింది. వెంటన్ అజయ్ సింగ్ అని పేరు స్ధానంలో సన్నీడియోల్ అని రీప్లేస్ చేయాలని కోరింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాల్లో ఏ పేరైతే ఇస్తారో అదే పేరును ఈవీఎంలపైనా ఉంచుతారు.

అయితే  కొన్ని అనివార్య  కారణాలతో దీనికి మినహాయింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే సన్నీడియోల్ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.