సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో మిగిలిన ఈ రెండు దశల్లో వీలైనన్ని సీట్లు చేజేక్కించుకోవాలని ప్రధాన  పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

ప్రధాని మోడీని ప్రియాంక గాంధీ దుర్యోధనుడని వ్యాఖ్యానించడంతో ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత జీతూ జితారి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న జితారి... ప్రియాంక గాంధీ ప్రధానిని దుర్యోధనుడితో పోల్చుతున్నారు.

కానీ ఆమె తండ్రి రావణుడు.. ఆయన ఏకంగా దేశాన్నే అమ్మేశారని ఆరోపించారు. కాగా.. రాజీవ్‌ను అవినీతపరుడని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని విద్వేషాన్ని తాము ప్రేమతో ఎదుర్కొంటామంటూ బదులిచ్చారు.