ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఈ సారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై పోటీకి భోజ్‌పురీ సూపర్‌స్టార్, సింగర్ దినేశ్ లాల్ యాదవ్‌ను బీజేపీ బరిలోకి దింపింది.

ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో రసవత్తరపోటీ జరుగుతోంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మెజారిటీ స్థానాలను దక్కించుకుని కేంద్రంలో అధికారం చేపట్టాలని అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి.

కాగా ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఈ సారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై పోటీకి భోజ్‌పురీ సూపర్‌స్టార్, సింగర్ దినేశ్ లాల్ యాదవ్‌ను బీజేపీ బరిలోకి దింపింది.

తూర్పు యూపీలోని అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో వీరిద్దరూ పోటీలో నిలిచారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన దినేశ్ లాల్ ‌ఘాజీపూర్‌లోని తాండ్వా గ్రామానికి చెందిన వారు. ఆయన ‘నిరహువ సతల్ రహే’ ఆల్బమ్‌తో ప్రజల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.

దానితో పాటు అనేక భోజ్‌పురీ సినిమాల్లో నటించి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీలోనే ఉన్న దినేశ్ 2014 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. అయితే కొద్దిరోజుల క్రితం యూపీ సీఎం ఆదిత్యనాథ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

వెంటనే ఆయనకు అజంగఢ్ టికెట్ ఇచ్చేసింది బీజేపీ అధిష్టానం.. సినీగ్లామర్‌తో పాటు సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా దినేశ్ లాల్ యాదవ్.. అఖిలేష్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.