కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని  అమేథీతో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయనున్నారు. దీంతో వయనాడ్‌ స్థానంపై ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో రాహుల్ గాంధీని ఓడించేందుకు బీజేపీ కూడా బలమైర అభ్యర్ధిని రంగంలోకి దించింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన ‘భారత్ ధర్మ జనసేన (బీడేజేఎస్) చీఫ్ తుషార్ వెల్లప్పల్లిని బరిలోకి దించింది.

ఈ మేరకు సోమవారం బీజేపీ అధికారికంగా ప్రకటించింది. తుషార్ చాలా శక్తివంతమైన, డైనమిక్ నేత, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం కట్టుబడ్డ భారతీయ జనతా పార్టీ ఆశయాలను ఆయన ముందుకు తీసుకెళ్తారు. వెల్లప్పల్లితో కలిసి బీజేపీ కేరళలో రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరించనుంది. అని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు.