దేశవ్యాప్తంగా మంగళవారం మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో.. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రైసన్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఆమె ఓటేశారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రనిప్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. 

ఉదయం గాంధీనగర్ లో కుమారుడు నరేంద్ర మోదీని హీరాబెన్ మోదీ ఆశీర్వదించారు. ఆమె కొడుకును ఆశీర్వదించిన అనంతరమే ఓటు వేశారు. తల్లి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాతే.. మోదీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

మోదీ ఓటేసిన అనంతరం మాట్లాడుతూ.. ఐఈడీ బాంబుల కన్నా.. ఓటరు ఐడీ అత్యంత శక్తివంతమైనందని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఉగ్రవాదులకు ఐఈడీ బాంబులే ఆయుధాలు అని, కానీ ప్రజాస్వామ్యానికి ఓటరు ఐడీయే శక్తి అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.