సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బ్యూటీ నుస్రత్ జహాన్. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆమె తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మోస్ట్ బ్యూటిఫుల్ ఎంపీ బిరుదు కూడా ఆమె సొంతం చేసుకున్నారు. కాగా... ఆమె త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.

గ్లామర్ పరంగా పేరొందిన ఆమె తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించారు. ‘నాకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు అందరికీ ధన్యవాదాలు. నేను స్వతహాగా ముస్లింను. అయినా అన్నివర్గాలవారూ ఓటు వేశారు. నేను దీదీ (మమతా బెనర్జీ) నుంచి స్ఫూర్తి పొందాను. నా తొలి ఓటును 18వ ఏట దీదీకే వేశాను’ అని తెలిపారు. 

కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నుస్రత్ వివాహానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తాను కోల్‌కతాకు చెందిన బిజినెస్ మ్యాన్ నిఖిల్‌జైన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకునేదీ త్వరలోనే తెలియజేస్తానని అన్నారు.