ఓటరు జాబితాలో పేరు లేకున్నా.. తమిళ హీరో శివ కార్తికేయన్ ఓటు వేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా  రెండో దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో ఈనెల 18వ తేదీన జరిగిన పోలింగ్ లో హీరో  శివకార్తికేయన్‌ దంపతులు వలసరవక్కంలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. 

శివ కార్తికేయన్ భార్య ఆర్తి పేరు ఓటరు జాబితాలో ఉండగా.. కార్తి కేయన్‌ పేరు మాత్రం గల్లంతైంది. అయినా ఓటేశారు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ప్రత్యేక అనుమతి’ తీసుకున్నానని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం, వేలికి సిరా ఉన్న ఫొటోను శివకార్తికేయన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 

దీనిపై తమిళనాడు ఎన్నికల ప్రధాన అధికారి సత్యబ్రత సాహూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆయన పేరు ఓటర్ల జాబితాలో లేదు. కానీ ఆయన ఓటేశారు. ఇది అక్కడి పోలింగ్‌ కేంద్రం అధికారుల తప్పిదమే. వారిపై చర్యలకు ఆదేశించాం’’ అని తెలిపారు.