Asianet News TeluguAsianet News Telugu

నా ప్రాణానికి ముప్పు ఉంది.. ఊర్మిళ షాకింగ్ కామెంట్స్

సినీ తారగా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న నటి ఊర్మిళ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముంబయి నార్త్ నియోజకవర్గానికి పోటీకి కూడా దిగారు. ఎన్నికల ప్రచారంలోనూ ఊర్మిళ దూసుకుపోతున్నారు.

"Threat To Life": Urmila Matondkar After Congress-BJP Fight At Campaign
Author
Hyderabad, First Published Apr 15, 2019, 3:59 PM IST

సినీ తారగా లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న నటి ఊర్మిళ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముంబయి నార్త్ నియోజకవర్గానికి పోటీకి కూడా దిగారు. ఎన్నికల ప్రచారంలోనూ ఊర్మిళ దూసుకుపోతున్నారు. కాగా.. ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఆమె చేసిన కామెంట్స్ అందరినీ షాకింగ్ కి గురిచేశాయి.

తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు. బోరివలిలో సోమవారం ఊర్మిళ రోడ్ షో నిర్వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ , బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

మేము ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటుంటే 15 నుంచి 20 మంది వ్యక్తులు అక్కడకు వచ్చి మోదీకి అనుకలంగా నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో నేను ఏమీ స్పందించలేదు. అయితే ఆ వచ్చిన వ్యక్తులు అభ్యంతకర చర్యలకు పాల్పడుతూ డాన్సులు చేస్తూ, మహిళలను బెదరించే ప్రయత్నం చేశారు. నా వాహనం వైపు కూడా దూసుకువస్తుండటంతో మా కార్యకర్తలు కలగజేసుకుని వారిని అడ్డుకున్నారు' అని ఆమె చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios