సినీ నటి, బీజేపీ రాంపూర్ అభ్యర్థి జయప్రదను... ద్రౌపదితో పోల్చారు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సమాజ్ వాది పార్టీ నేత అజంఖాన్.. జయప్రదపై వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై సుష్మా స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ ని ఉద్దేశించి.. ‘‘ ములాయం బయ్యా.. మీరు సమాజ్ వాదీ పార్టీకి తండ్రి లాంటి వారు కదా. రామ్ పూర్ లో మీ పార్టీ నేత ద్రౌపదీ వస్త్రాపహరణం చేశాడు. మీరు మాత్రం బీష్ముడిలాగా మౌనంగా కూర్చొని తప్పు చేయకండి’’ అంటూ ట్వీట్ చేశారు.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో అజంఖాన్.. జయప్రదను ఉద్దేశించి.."రాంపూర్ ప్రజలారా... ఓ షాహ్ బాద్ ప్రజలారా.. ఓ భారత ప్రజలారా... ఆ వ్యక్తిని గుర్తించడానికి మీకు 17 ఏళ్లు పట్టింది, ఆ వ్యక్తి ఖాకీ అండర్ వియర్ వేసుకుందని నేను 17 రోజుల్లోనే గుర్తించాను" అని ఆజం ఖాన్ అన్నారు. అఖిలేష్ యాదవ్ సమక్షంలోనే అజంఖాన్ ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. 

దీంతో.. అజమ్ ఖాన్ చేసిన కామెంట్స్ పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఓ మహిళానేతపై చేయాల్సిన కామెంట్సేనా ఇవి అని అందరూ మండిపడుతున్నారు. 

related news

ఖాకీ అండర్ వేర్ వేసుకుంది: జయప్రదపై ఆజం ఖాన్, బిజెపి ఫైర్

నా అశ్లీల చిత్రాలపై చెప్పా, కానీ...: ములాయంపై జయప్రద

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి