Asianet News TeluguAsianet News Telugu

మీట ఏది నొక్కినా..ఓటు బీజేపీ కే : అఖిలేష్ యాదవ్

దేశవ్యాప్తంగా మంగళవారం మూడోదశ పోలింగ్ జరిగింది. కాగా.. ఈ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరుపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 

"Digital India": Akhilesh Yadav's Dig At PM Over Voting Machine Glitch
Author
Hyderabad, First Published Apr 23, 2019, 3:46 PM IST

దేశవ్యాప్తంగా మంగళవారం మూడోదశ పోలింగ్ జరిగింది. కాగా.. ఈ ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరుపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని.. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మోరాయిస్తున్నాయని ఆరోపించారు.

ఏ మీట నొక్కినా..  ఓటు బీజేపీకే పడుతోందని ఆయన ఆరోపించారు. ఈవీఎంలను ఎలా ఆపరేట్ చేయాలో కూడా పోలింగ్ సిబ్బందికి తెలియడం లేదని.. ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

దేశవ్యాప్తంగా జరుగుతున్న మూడోవిడుత పోలింగ్ లో 350కిపైగా ఈవీఎంలను మార్చారని.. ఎన్నికల కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేసినా.. ఈవీఎంలు మోరాయించడం ఏమిటని మండిపడ్డారు.

కాగా మూడోదశ పోలింగ్‌లోనూ పలు రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో కొన్ని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు పనిచేయలేదు. పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. తిరువనంతపురంలోని ఓ కేంద్రంలో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. బీజేపీకి పోలయినట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో ఆయా కేంద్రాల్లో ఓటింగ్ నిలిపివేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios