న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఎ బలం పెరిగినట్లు టైమ్స్ నౌ - విఎంఆర్ తాజా ఓపినియన్ పోల్ తెలియజేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఎకు 21 సీట్లు మాత్రమే తక్కువ అవుతాయని సర్వే అంచనా వేసింది. 

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రజాకర్షణ పథకాలను ప్రవేశపెట్టడం వల్ల, బాలకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడి వల్ల ఎన్డీఎకు ఆదరణ పెరిగినట్లు టైమ్స్ నౌ - విఎంఆర్ ఓపినియన్ పోల్ అంచనా వేసింది. మార్చిలో నిర్వహించిన ఈ సర్వేలో 16,931 మంది పాల్గొన్నట్లు తెలిపింది. 

తమిళనాడు 

ఈ రాష్ట్రంలో ఏడు పార్టీలతో ఏర్పడిన కూటమి వల్ల ప్రయోజనం కలుగుతున్నట్లు అంచనా వేసింది.

మొత్తం సీట్లు - 39
కాంగ్రెసు కూటమి 34, బిజెపి కూటమి 5

కేరళ

త్రిముఖ పోటీ ఉంటుందని అంచనా
మొత్తం సీట్లు 20
యుడిఎఫ్ 16, ఎన్డీఎ 1, ఎల్డీఎఫ్ 3

ఆంధ్రప్రదేశ్ 

మొత్తం సీట్లు 25

టీడీపి 3, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ 22

జగన్మోహన్ రెడ్డి వైసిపి ఎన్నికలను స్వీప్ చేయడం ఎన్డీఎకు, తృతీయ ఫ్రంట్ కు ఊపయోగపడుతుందని అంచనా.

తెలంగాణ

మొత్తం సీటు 17

యుపిఎ 1, ఎన్డీఎ 2, టీఆర్ఎస్ 13, ఇతరులు 1

కెసిఆర్ ఆధిపత్యం తృతీయ ఫ్రంట్ అధికారం కోసం చేసే ప్రయత్నాలకు ఊపు వస్తుందని అంచనా.

కర్ణాటక 

మొత్తం సీట్లు 28

యుపిఎ 13, ఎన్డీఎ 15

బాలకోట్ దాడులు బిజెపి అవకాశాలను పెంచినట్లు అంచనా.

పశ్చిమ బెంగాల్

మొత్తం సీట్లు 42

యుపిఎ 0, ఎన్డీఎ 11, టీఎంసి 31, లెఫ్ట్ ఫ్రంట్ 0

బీహార్ 

మొత్తం సీట్లు 40

యుపిఎ 13, ఎన్టీఎ 27

జార్ఖండ్ 

మొత్తం సీట్లు 14

కాంగ్రెసు కూటమి 6, బిజెపి 8

ఒడిశా

మొత్తం సీట్లు 21

బిజెపి 14, బిజెడి 7

అస్సాం 

మొత్తం సీట్లు 14

కాంగ్రెసు 4, బిజెపి కూటమి 8, ఎఐడిఎఫ్ 2

మహారాష్ట్ర

మొత్తం సీట్లు 48

కాంగ్రెసు కూటమి 9, బిజెపి కూటమి 39

గుజరాత్ 

మొత్తం సీట్లు 26

కాంగ్రెసు 2, బిజెపి 24

ఉత్తరప్రదేశ్ 

మొత్తం సీట్లు 80

కాంగ్రెసు కూటమి 2, బిజెపి కూటమి 42, ఎస్పీ -బిఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి 36

ఉత్తరాఖండ్

మొత్తం సీట్లు 5

కాంగ్రెసు 0, బిజెపి 5

మధ్యప్రదేశ్ 

మొత్తం సీట్లు 29

కాంగ్రెసు 7, బిజెపి 22

రాజస్థాన్

మొత్తం సీట్లు 25

కాంగ్రెసు 5, బిజెపి 20

ఢిల్లీ

మొత్తం సీట్లు 7

కాంగ్రెసు 0, ఆప్ 0, బిజెపి 7

హర్యానా

మొత్తం సీట్లు 10

కాంగ్రెసు 2, బిజెపి 8