న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని టైమ్స్ నౌ - విఎంఆర్ ఒపినీయన్ పోల్ అంచనా వేసింది. రాష్ట్రంలోని 25 లోకసభ స్థానాల్లో వైసిపి 22 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమవుతుందని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 49.5 శాతం మంది ఓటర్లు మద్దతు పలకనున్నారని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. 

నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో ‘రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌’ నిర్వహించిన సర్వేలో వైఎస్సార్‌ 19 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని గత జనవరిలో స్పష్టం చేసింది.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌-13, బీజేపీ-2, ఎంఐఎం-1, కాంగ్రెస్‌-1 గెలుచుకోనున్నట్లు అంచనా వేసింది. ఇప్పటికే ఇండియా టుడే సర్వే ఏపీకి కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.