Asianet News TeluguAsianet News Telugu

ఓపీనియన్ పోల్: బీజేపీదే పైచేయి, అయితే...

 2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి  స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశం లేదని ఇండియాటీవీ, సీఎన్ఎక్స్  సర్వే రిపోర్ట్ తేల్చింది. 

IndiaTV-CNX Opinion Poll post-Grand Alliance: NDA may fail to repeat its 2014 win in LS elections, likely to fall short of clear majority
Author
New Delhi, First Published Feb 28, 2019, 4:33 PM IST

న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి  స్పష్టమైన మెజారిటీ దక్కే అవకాశం లేదని ఇండియాటీవీ, సీఎన్ఎక్స్  సర్వే రిపోర్ట్ తేల్చింది. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 245 సీట్లు దక్కుతాయని సర్వే తేల్చింది. ఈ ఏడాది జనవరి 13వ తేదీన ఈ సర్వేను  ఆ సంస్థ విడుదల చేసింది.

గత ఎన్నికల్లో బీజేపీకి 272 ఎంపీ సీట్లు దక్కాయి. పార్లమెంట్‌లో మొత్తం 543 సీట్లున్నాయి. ఏ పార్టీ మద్దతు అవసరం లేకున్నా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం గత ఎన్నికల్లో దక్కింది. కానీ, మిత్రపక్షాలకు బీజేపీ తన మంత్రివర్గంలో చోటు కల్పించింది.

అయితే ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో బీజేపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గత ఎన్నికల్లో వచ్చినట్టుగా ఫలితాలు రావని ఈ సర్వే తేల్చి చెప్పింది.

కనీస మెజారిటీకి బీజేపీకి 27 ఎంపీ సీట్లు తక్కువయ్యే అవకాశం ఉందని ఈ సర్వే చెప్పింది. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్వహించినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 146 సీట్లు కైవసం చేసుకొంటుందని, ఇతర పార్టీలు 152 సీట్లను గెలుచుకొంటాయని సర్వే స్పష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios