వడ్డెబోయిన శ్రీనివాస్ కవిత: రోజుభాష-రాజభాష

ఒకే దేశం, ఒకే భాష అనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా నినాదంపై తెలుగు కవి వడ్డెబోయిన శ్రీనివాస్ కవితాత్మకంగా స్పందించారు. దేశంలోని భాషా వైవిధ్యాన్ని ఆయన ఈ కవితలో ఎత్తి చూపారు.

Vaddeboina Srinivas Telugu poem, Kavith on language issue

వికసిత సాంస్క్రతిక వైవిధ్య మరణాన్ని  
కలకంటున్న వాడా!  
సహజీవన సహనం   
మరణించిన వాడా!! 

అయితే  
ఒక్క నీ కాలు నరుక్కో   
ఓ చెయ్యి తెంపుకో  
ఒక్క నీ కన్ను పొడ్చుకో   
ఒక్క చెవి సీసం నింపు   
అయితే  
ఒక్క నీ ముక్కు రంధ్రం బిరడా బిగించు  

నీ గుండె ఒక భాగం కోసెయ్    
ఊపిరి తిత్తొకటి పీకెయ్   
అయితే    
నీ కాలేయం రొండు భాగాలెందుకు?    

నీ మెదడు ఏ భాగం తీసేస్తావో తీసెయ్   
పెద్దపేగో చిన్నపేగో 
దేన్నో ఒకదాన్ని పడెయ్    

మహా మాంత్రికుడా!   
నీ ఒంట్లోనే   
రొండ్లున్నప్పుడు   
ఒక్కటే అయినా   
వందల భాషల ఊరేగింపు కదా దేశం!    
ఒక్క భాషెట్లా?    
వందల జాతుల చెట్టపట్టాల్ గదా దేశం!!   

ఉత్తరంకే ప్రవహిస్తదా?   
ఉత్తర గంగా!   
ఒక్క దిక్కే ఉన్నదా?   
దేశం మొత్తం !   
నీ మాయా గెలుపుకు    
నీ ఓటే చాలా?   
ఒకే వొక్క పూసకాదు గదా!   
నీ వెన్నెముక ?

నాలుక్కొక్కటి చాలు !  
పెదాలు కోసేస్కో ?   
కిడ్నీలు  రొండెందుకు?

చెర బట్టిన రూపాయి   
చెదరిన కలల మీద  
తెల్లగుడ్డ కప్పాలను కుంటున్న  
తెగ బలిసిన తెంపరి తనమా!  
ఒళ్ళంతా   
చర్మమొకటైనా   
జీవ విసర్జక యంత్రాలెన్నో ?   

నీకు నువ్వే   
ఒకేఒక కణాన పుట్టిన 
ఏక కణ జీవివా?  

ఎన్ని బొక్కలుండాలె ?
ఎన్ని కండరాలుండాలె ?   
ఎన్ని కణాలుండాలె ?  

నువ్వొక్కనివి కావాలంటే ?  
అమ్ముండాలె   
నాన్నుండాలె   

అనేకనేకం కలిస్తేనే    
నువ్వైనౌ  
ఒకే దేశం ఒకే జాతి ఒకే ఎన్నిక ఒకే సంస్క్రతి   
బహుళ సాంస్క్రతిక వారసత్వానికి  
తలకొరివి పెట్టకు !  

ఈ మట్టి   
నా మాతృ బంధం తెంపకు !
ఛల్   
తెలుగు   
నాప్రాణ భాష !    

 —వడ్డెబోయిన శ్రీనివాస్

కవితలు, కథలు, సాహితీ విమర్శనా వ్యాసాలు, పుస్తక సమీక్షలు పంపించాల్సిందిగా కోరుతున్నాం. వాటిని వీలు వెంబడి ఇక్కడ ప్రచురిస్తాం. సాహితీవేత్తలు ఈ విభాగాన్ని వాడుకోవడానికి వీలు కల్పిస్తూ తమ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలని కోరుతున్నాం. మీ ఫోటో పంపించడం మరిచిపోకండి. email: pratapreddy@asianetnews.in

మరిన్ని కవితలు

వనపట్ల సుబ్బయ్య కవిత: ఎక్కబుడ్డి

గజ్జెల రామకృష్ణ తెలుగు కవిత: సహవాసం

కోడం కుమారస్వామి కవిత: మనలోని మను

డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి కవిత: స్వచ్ఛ నేస్తం

ప్రపంచ శాంతి దినోత్సవం: మనమూ శాంతి గంటను మోగిద్దాం

తెలుగు కవిత: పార్టి జెండాలు - కండువాలు

దాసరి మోహన్ తెలుగు కవిత: అలసి పోతున్నాను...

   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios