ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ఫుడ్, దుస్తులు, ప్లేసెస్ అంటూ ప్రతీ దాంట్లో సొంత ఇష్ట ఇష్ఠాలు ఉంటాయి. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చు. అందులోనూ ప్రతి ఒక్కరూ వేర్వేరు రంగులను ఇష్టపడతారు. అయితే మనకు ఇష్టమైన రంగును బట్టి మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొంచంటున్నారు నిపుణులు.
ప్రతి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలు వేర్వేరుగా ఉంటాయి. అందులోనూ ఒకరికి నచ్చినవి మరొకరికి నచ్చకపోవచ్చు. ఫుడ్, దుస్తులు, ఆభరణాలు, ప్రేమ మొదలైనవి ప్రతీది డిఫరెంట్ గానే ఉంటుంది. మనిషి తీరు మనిషి లేనట్టుగా వివిధ వ్యక్తుల అభిరుచులు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. అదే విధంగా ప్రతి ఒక్కరూ వేర్వేరు రంగును ఇష్టపడతారు. ఒక వ్యక్తి ఒకే రంగును ఎందుకు ఇష్టపడతాడో చెప్పడం కష్టం. కానీ మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియజేస్తుంది. ఇంతకి ఎలాంటి రంగు ఎలాంటి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందో తెలుసుకుందాం పదండి..
పింక్ (Pink).. పింక్ సాధారణంగా అమ్మాయిలకు ఇష్టమైన రంగుగా పిలువబడుతున్నప్పటికీ.. కొంతమంది అబ్బాయిలు కూడా ఈ రంగును ఇష్టపడతారు. పింక్ రంగును ఇష్టపడే వ్యక్తులు చాలా మృదుస్వభావులు. వారి మనసులో ఏముందో అదె చెప్తారు. తప్ప అబద్దాలు అస్సలు ఆడరు. ఇలాంటి వ్యక్తులు తమ ఆలోచనల ప్రపంచంలోనే జీవించడానికి ఇష్టపడతారు. వీరు ఇతరకుల కంటే కొంచెం ఎక్కువగా సరసాలాడతారు. అలాగే వీరు రొమాంటిక్ కూడా.
ఎరుపు (Red).. ఎరుపు రంగును ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఎరుపు రంగును ఇష్టపడే వ్యక్తులు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అలాగే వీరి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది. కానీ వీళ్లకు చాలా త్వరగా కోపం వస్తుంది.
నీలం రంగు (Blue).. ఎవరైతే నీలం రంగును ఇష్టపడతారో.. వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలాంటి వ్యక్తులు చాలా స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు. కానీ వీరు తమ కష్టాలను త్వరగా ఎవరితోనూ పంచుకోరు. వీరు ప్రతి ఒక్కరికీ ప్రేమను పంచాలనే భావనను కలిగి ఉంటారు.
ఆకుపచ్చ రంగు (Green).. ఆకుపచ్చ రంగును ఇష్టపడే వ్యక్తులు ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారోనని దాని గురించే ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. వీరు ఇతరుల అభిప్రాయాలకు కూడా చాలా త్వరగా ప్రభావితమవుతారు. ఎదుటివారు తమ గురించి చెడుగా ఆలోచించకూడదని వారు భావిస్తారు.
పసుపు (Yellow).. ఎల్లో కలర్ ను ఇష్టపడే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ పసుపు రంగును ఇష్టపడే వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు. వీరు తమ జీవితంలో దేని గురించీ పెద్దగా పట్టించుకోరు. జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. దేని గురించి టెన్షన్ పడరు. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడపాలనుకుంటారు.
నలుపు రంగు (Black).. బ్లాక్ కలర్ ను అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు ఎప్పుడూ వారి కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. అలాగే చాలా కోపంగా కూడా ఉంటారు. ఈ వ్యక్తులు చిన్న విషయాలకు కూడా త్వరగా కోపం తెచ్చుకుంటారు. వీరు తమ అధికారాన్ని ఉపయోగించి ఇతరులను తమ నియంత్రణలో ఉంచాలని భావిస్తారు. ప్రతిదీ తమ కంట్రోల్ లోనే ఉండాలని వారు కోరుకుంటారు.
తెలుపు (White).. తెలుపు రంగు శాంతిని, నిరాడంబరతను సూచిస్తుంది. తెలుపును ఇష్టపడే వ్యక్తులు కూడా చాలా సరళమైన, స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు. వారు దేనినీ అతిగా చేయడానికి ఇష్టపడరు. ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారు అనే దాన్ని వదిలేసి పూర్తిగా తమ పని గురించి మాత్రమే ఆలోచిస్తారు. శ్రద్ధ వహిస్తారు.
