International Friendship Day 2022 : ప్రపంచంలో ఉన్న అన్ని బంధాల్లో స్నేహ బంధమే చాలా గొప్పది. విలువైంది. అందుకే అంటారు ఒక మంచి స్నేహితుడు వంద మందితో సమానమని. అసలు ఈ రోజు ఎలా స్టార్ట్ అయ్యింది... దీని వెనకున్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

International Friendship Day 2022 : స్నేహాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. స్నేహం మాటల్లో చెప్పలేని ఒక గొప్ప అనుభూతి. అందుకే స్నేహితుడిని మనసారా హత్తుకుని తనపై ఉన్న ప్రేమను తెలియజేస్తారు. ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా.. ఒక్క స్నేహితుడు మాత్రమే జీవితాంతం మనకు అన్ని వేళలా అండగా ఉంటాడు. ఒక మంచి స్నేహితుడు మనకు తోడుగా ఉన్నాడన్నా ఆలోచనే మనల్ని ఎన్ని కష్టాల్నుంచి బటయడేస్తుంది. అందుకే కవులంటారు స్నేహితుడు కొండంత అండ అని . అందుకే అంటారు కదా.. మంచి స్నేహితుడు ఒక్కడున్నా వంద మందితో సమానమని. ఎంతైనా గొప్ప స్నేహితుడిని పొందడానికి కూడా లక్ ఉండాలి.

స్నేహితులకు ఇష్టమైన ఫ్రెండ్ షిప్ డేను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు. ఈ రోజు ఎలా మొదలైంది. దీని వెనకున్న చరిత్ర ఏంది అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రతి ఏడాది జూలై 30 న అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ పౌర సంస్థ అయిన World Friendship Crusade ద్వారా 1958 లో మొదటిసారిగా ఈ రోజును జరుపుకోవాలని నిర్ణయించారు. స్నేహం ద్వారా శాంతి సంస్కృతిని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. 

2011 లో ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశం ఈ రోజును అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. భారత దేశంతో పాటుగా ప్రపంచంలోని ఇతర దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్ షిప్ డేను సెలబ్రేట్ చేసుకుంటాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు 7 తారీఖున ఫ్రెండ్ షిప్ డే ను జరుపుకోనున్నారు. 

ఫ్రెండ్ షిప్ డేను హాల్మార్క్ కార్డ్స్ జాయిస్ హాల్ వ్యవస్థాపకుడు 1930 లో ప్రారంభించారు. 1958 లో లో పరాగ్వేలో అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరుపుకున్నారు. స్నేహ బంధాన్ని గౌరవించడానికి ఈ ప్రత్యేకమైన రోజుకు ఏర్పాటు చేశారు. దీని తర్వాత 1988 లో ఐక్యరాజ్య సమితి స్నేహ రాయబారిగా విన్నీ ది పూహ్ ను నియమించింది. 2011 లో ఐక్యరాజ్య సమితి సమావేశంలో జూలై 30 అంతర్జాతీయ స్నేహ దినోత్సవం అని అధికారికంగా గుర్తించబడింది.