Asianet News TeluguAsianet News Telugu

నెయిల్ పాలిష్ వేసుకుంటే.. బరువు పెరుగుతారా..?

నెయిల్ పాలిష్ అమ్మాయిలు ఎందుకు వేసుకుంటారు..? తమ చేతి వేళ్లు అందంగా కనపడాలని వేసుకుంటారు అవునా..? అందం కోసం నెయిల్ పాలిష్ మీద దృష్టి పెడితే.. అది మీ బరువు ని అమాంతం పెంచేస్తుందంటున్నారు నిపుణులు.

WHAT? Your Nail Polish Can Make You Gain Weight?
Author
Hyderabad, First Published Apr 24, 2019, 4:01 PM IST

నెయిల్ పాలిష్ అమ్మాయిలు ఎందుకు వేసుకుంటారు..? తమ చేతి వేళ్లు అందంగా కనపడాలని వేసుకుంటారు అవునా..? అందం కోసం నెయిల్ పాలిష్ మీద దృష్టి పెడితే.. అది మీ బరువు ని అమాంతం పెంచేస్తుందంటున్నారు నిపుణులు. మీరు  చదవింది నిజమే.. నెయిల్ పాలిష్ రెగ్యులర్ గా వేసుకుంటే.. వాళ్లు బరువు పెరుగుతారట.

దీనికి దానికి ఏంటి సంబంధం అంటే.. సంబంధం ఉంది అంటున్నారు నిపుణులు. ఫేమస్ డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్కువ నెయిల్ పాలిష్ వాడటం వల్ల అమ్మాయిలు బరువు పెరుగుతారట. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనంతో నెయిల్ పాలిష్ తయారు చేస్తారు. ఈ రసాయనం ప్లాస్టిక్,ఫామ్ ఫర్నీచర్ మంటలు అంటుకోకుండా వాడే ఈ రసాయన్నాన్ని నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నేందుకు వాడతారు. వీటిని వాడటం వల్ల మానవ హార్మోన్లపై ప్రభావం పడతాయి. దాంతో.. అమ్మాయిలు బరువు పెరుగుతారని పరిశోధకులు అంటున్నారు.

మన మార్కెట్లో దొరికే 3వేల రకాల నెయిల్ పాలిష్ లపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు. దాదాపు 49శాతం నెయిల్‌పాలిష్‌లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంటుందని తేల్చారు. ఇలాంటి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, వీటిని పెట్టుకున్న 10-14గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

అందుకే.. నెయిల్ పాలిష్ వాడకం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టిఫీషియల్ నెయిల్స్ పెట్టుకొని నెయిల్ పాలిష్ వేసుకుంటే... ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios