ugadi 2022: ఉగాది రోజు చేయాల్సిన పనులు.. చేయకూడని పనులు ఇవే..

ugadi 2022: ఉగాది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ. మరి ఈ పండుగ రోజు ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుస్తుంది. అయితే ఈ పండుగ రోజు కొన్నిపనులను అస్సలు చేయకూడదు. అవేంటంటే.. 

what is ugadi speciality and importace

ugadi 2022: తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఇక ఆ రోజు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, రాశీఫలాలు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి... రాశి వారిగా వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయన్న విషయాలు పంచాంగంలో తెలుస్తాయి. 

పురాణాల ప్రకారం.. ఈ  సృష్టి ఉగాది నుంచే ప్రారంభమయ్యిందని చెప్తున్నాయి. అలాంటి రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అలాగే ఉగాది పర్వదినాన ఎలాంటి పనులను చేయాలో తెలుసుకుందాం పదండి. 

ఉగాది రోజున చేయాల్సిన పనులు.. 

ఉగాది పర్వదినాన సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలకు నువ్వుల నూనె, ఒంటికి సున్నిపిండి పెట్టుకుని తలస్నానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత దేవుడిని నిష్టగా పూజించాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 

ఇకపోతే ఈ పండుగ  పర్వదినాన కొత్త బట్టలు వేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అంతేకాదు ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక గొడుకు కొనడం ఉత్తమం. ఎండా, వాన, నుంచి ఇది మీకు రక్షణనిస్తుంది. 

ఇక రోజున ఇతరులకు విసన కర్రలను దానం చేస్తే మంచి మేలు జరుగుతుందని పండుతులు చెబున్నారు. మన తాతలు, ముత్తాతలు వారి కాలంలో విసన కర్రలతోనే గాలిని విసురుకునే వారు. వీటితో విసురుకోవడం వల్ల ఎంతో హాయి కలుగుతుంది. అలాంటి వాటిని దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తదట. 

ఉగాది నుంచి పౌర్ణమి వరకు దేవతారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చైత్ర శుక్ల పాడ్యమి దినాన బ్రహ్మను పూజిస్తే.. శివుడిని విదయ దినాన నిష్టగా పూజించాలి. అలాగే గౌరీ శంకరుడిని తదియ రోజున, వినాయకుడిని చుతుర్థి రోజున అంటూ.. పౌర్ణమి వరకు దేవుళ్లను నిష్టగా పూజించాలని పండితులు చెబుతున్నారు. 

ఇకపోతే ఈ పండుగ రోజున అందరూ ఖచ్చితంగా పచ్చడిని చేయాలి. ఈ పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలో ఎన్నో అనుభవాలకు భావాలను చెప్తాయి. అంతేకాదు ఈ పచ్చడిని తాగితే.. ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారట. 

చేయకూడని పనులు.. 
బద్దకంగా ఉండకూడదు. ఉగాది రోజున కూడా ఆలస్యంగా నిద్ర లేవడం అంత మంచిది కాదంటున్నారు పండితులు. ముఖ్యంగా ఈ పర్వదినాన ఆల్కహాల్, సిగరేట్, మాంసాహారాలను అస్సలు తినకూడదు. 

ముఖ్యంగా ఆ రోజున పంచాంగ శ్రవణాన్ని.. దక్షిణం ముఖాన కూర్చొనే చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండదని పురాణాలు చెబుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios