Ugadi 2022: ఉగాది పండుగను జరుపుకోవడానికి వెనకున్న అసలు కారణాలు ఇవే..
Ugadi 2022: ప్రతి ఏడాది చైత్ర శుద్ధ మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు వారి కొత్త సంవత్సరమైన ఉగాది పండుగ పుట్టు పూర్వోత్తరాలు ఎంత మందికి తెలుసు..
Ugadi 2022: తెలుగువారి పండుగంటే మనకు మొదట గుర్తొచ్చే ఉగాది ఫెస్టివల్. ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది ఉగాది పండుగ ఏప్రిల్ 2 తేదీ(శనివారం) న వచ్చింది.
ఆ ఉగాది రోజున పండితులు పంచంగ శ్రవణాన్ని ఏర్పాటు చేస్తారు. పంచాంగం ప్రకారం.. ఏ రాశి వారికి ఈ ఏడాది బాగుంటుంది. ఏ రాశివారికి సమస్యలొస్తాయి.. వాటి నివారణా మార్గాలేంటి.. ఏ ఏడాది పంటలు ఎలా పండనున్నాయి.. రాశుల వారిగా వారి ఆదాయ వ్యయాలను తెలుసుకుంటారు. అంతేకాదు గ్రహాల స్థితి గతుల తెలుసుకుని.. జాతకంలో దోషాలంటే శాంతి పూజలు, నివారణ కోసం పూజలను నిర్వహిస్తారు.
ఈ 2022 లో మనమందరం 'శుభకృతు' నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నం.. ఈ సందర్బంగా ఉగాది పుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకుందాం పదండి..
పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు ఈ అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజునే అంటే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజునే సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు నుంచే ఈ లోకం ప్రారంభమయ్యిందని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
వేధాలను హరించిన సోమకుడిని శ్రీ మహా విష్ణువు మత్స్యవతారం ఎత్తి అతడిని సంహరిస్తాడు. అంతేకాదు వేధాలను ఆ బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఈ సందర్బంగా కూడా ఉగాది పండుగను జరుపుకుంటున్నామని పురాణాల్లో ఉంది.
అంతేకాదు ఈ చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజునే వసంత రుతువు కూడా ప్రారంభమవుతుంది. అందుకే ఈ రోజున నూతన జీవితానికి నాందిగా సెలబ్రేట్ చేసుకుంటారు.
ఉగాది ని యుగాది అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం అని అర్థం. అంటే సృష్టి ఆరంభమైనదని ఉగాదికి అర్థం వస్తుంది.
ఇకపోతే యుగం అంటే జంట, లేదా ద్వయం అని అర్థం వస్తుంది. ఈ యుగానికి ఆది (ప్రారంభం)గా ఈ ఉగాది పండుగను జరుపుకుంటామని పండితులు చెబుతున్నారు.
ఇకపోతే ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. షడ్రుచుల సమ్మేళనంగా తయారుచేసే ఈ పచ్చడి జీవింలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలను, ఘటనలను సూచిస్తుంది. అంటే మనకు ఎదురయ్యే అనుభవాల సారాంశాన్ని ఈ పచ్చడి మనకు వివరిస్తుందన్న మాట. ఈ పచ్చడిలో వేసే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి ప్రతీక.