ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో చాలా మంది స్లీవ్ లెస్ డ్రెస్సులనే వేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే కొంతమంది స్లీవ్ లెస్ డ్రెస్సులను వేసుకోవాలనే ఇష్టం ఉన్నా.. అండర్ ఆర్మ్స్ నల్లగా ఉండటం వల్ల వేసుకోలేక పోతుంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే అండర్ ఆర్మ్ నలుపుదనాన్ని పోగొట్టొచ్చు. అదెలాగంటే..?
అండర్ ఆర్మ్స్ నల్లగా ఉన్నాయి.. వ్యాక్సింగ్ తర్వాత కూడా ఏం మార్పు రాలేదని చాలా మంది ఆడవారు బాధపడుతుంటారు. ఈ నలుపుదనం వల్ల స్లీవ్ లెస్ డ్రెస్సులను అస్సలు వేసుకోలేరు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
నిజానికి అండర్ ఆర్మ్ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చేతులకింద వెంట్రుకలను శుభ్రం చేయడానికి షేవింగ్ రేజర్లు, వ్యాక్సింగ్, హెయిర్ రిమూవల్ క్రీములను ఉపయోగిస్తారు. అయితే ఇవి అక్కడి వెంట్రుకలను తొలగించినా అక్కడి చర్మం రంగు మాత్రం నల్లగానే ఉంటుంది.
వ్యాక్సింగ్ వల్ల చేతుల కింద నల్లగా అవుతుందా?
అండర్ ఆర్మ్ నల్లగా కావడానికి వ్యాక్సింగ్ ఒక్కటే కారణం కాదు. దీనికి ఎన్నో ఇతర కారణాలు ఉన్నాయి. అండర్ ఆర్మ్ కు అప్లై చేసే ఏదైనా పెర్ఫూమ్ లేదా డియోడరెంట్ కూడా దీనికి కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. అయితే మెలనిన్ చర్మంలో హైపర్ పిగ్మెంటేషన్ కు కారణమవుతుంది. అయితే ఈ నలుపును కొన్ని సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టొచ్చు. అవేంటంటే
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ లో అమైనో, లాక్టిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది ఆస్ట్రిజెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మీ చర్మం నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్నికూడా శుభ్రపరుస్తుంది. అంతేకాదు చర్మ రంధ్రాలను కూడా తెరుస్తుంది. చంకల్లో నలుపుదనం పోయేందుకు కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుని అక్కడ అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత కడిగేయండి.
బేకింగ్ సోడా, పెరుగు
బేకింగ్ సోడా కూడా అండర్ ఆర్మ్ నలుపుదనాన్ని పోగొడుతుంది. బేకింగ్ సోడా ఎక్స్ఫోలియేటర్ గా పనిచేస్తుంది. పెరుగులో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. బేకింగ్ సోడాలో పెరుగు మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేయండి. దీన్ని మీ అక్కడ అప్లై చేయండి. కొద్దిసేపటి తర్వాత కడిగేయండి.
కలబంద
కలబంద మీ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీనిని నేచురల్ సన్స్క్రీన్ గా కూడా ఉపయోగిస్తారు. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని క్లీన్ చేస్తాయి. మంటను తగ్గిస్తాయి. అలాగే మృత కణాలను తొలగిస్తాయి. ఇందుకోసం ఇంట్లోని కలబంద ఆకును తీసుకుని దాని నుంచి జెల్ ను తీయండి. దీన్ని మీ చంకల్లో అప్లై చేయండి. నెల రోజుల పాటు దీన్ని అప్లై చేస్తే నలుపుదనం పోతుంది.
బంగాళాదుంప రసం
బంగాళాదుంప రసం కూడా అండర్ ఆర్మ్స్ ను తెల్లగా మార్చడానికి సహాయపడుతుంది. అయితే బంగాళాదుంప రసంలో కీరదోసకాయ రసాన్ని కూడా కలపొచ్చు. దోసకాయలలో బ్లీచింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ రెండింటి రసాన్ని మిక్స్ చేసి అండర్ ఆర్మ్ మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. కాసేపు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
బియ్యం పిండి, తేనె
బియ్యం పిండిని అండర్ ఆర్మ్స్ కి రుద్దండి. ఇది మృత చర్మాన్ని తొలగిస్తుంది. చర్మాన్ని తెల్లగా చేస్తుంది. తేనెలో నేచురల్ యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
