Asianet News TeluguAsianet News Telugu

భారతదేశంలో ఉన్న టాప్ 10 దేవాలయాలు ..

భారతదేశాన్ని దేవాలయాల భూమిగా పిలుస్తారు. ఎందుకంటే ప్రతి 3 కి.మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరంలో ఒక దేవాలయం ఖచ్చితంగా ఉంటుందట. అందులోనూ భారతీయులు దేవాలయాలను దర్శించుకోవడం రోజు వారి ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. ఈ దేవాలయాల్లో ఎన్నో అద్బుతమైన వాస్తు శిల్పంతో శతాబ్దాల నాటివి ఉన్నాయి. ఇవి పురాణాల్లో, చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తాయి. వీటిని తప్పక సందర్శించాల్సిన దేవాలయాలు కూడా. భారతదేశంలో ఉన్న టాప్ 10 దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

 Top 10 Famous Temples of India
Author
Hyderabad, First Published Aug 8, 2022, 12:16 PM IST

1. వైష్ణో దేవి ఆలయం-జమ్ము

ఇది జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని కత్రా పట్టణంలో ఉంది.  ఇండియాలో ఉన్న అత్యంత పూజ్యమైన, ప్రత్యేకమైన దేవాలయాలలో ఇది ఒకటి.  ఇది 5,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారు 12 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్ చేయాలి. కానీ ఈ ట్రెక్కింగ్ కూడా అంత ఈజీగా ఉండదు. అంత దూరం నడవలేనివారు pony ride లేదా palanquin లేదా హెలికాఫ్టర్ ద్వారా వెళ్లొచ్చు. నిజానికి ఈ దేవాలయం ఒక గుహలో ఉంటుంది. ఇక్కడ మూడు rock heads యే ఉంటాయి. విగ్రహం ఉండదు. దీనిని పిండిస్ అని పిలుస్తారు. ప్రతి ఏడాది ఈ దేవాలయాన్ని లక్షలాది మంది సందర్శకులు సందర్శిస్తారు. ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. 

2. కేదార్ నాథ్ ఆలయం- ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ జిల్లాలోని హిమాలయ శ్రేణుల్లో కేదార్ నాథ్ ఆలయం ఉంటుంది. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఇది ఒకటి. పాండవులు నిర్మించిన ఈ దేవాలయం దేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా చెప్పుకుంటారు. 14 కి.మీ దూరంలో.. కొండపై ఈ ఆలయం ఉంటుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే ఈ దేవాలయం తెరిచి ఉంటుంది. దేవాలయాన్ని మూసివేసి.. దేవతను పూజ కోసం ఉఖిమత్ కు తీసుకువెళతారు. ఈ ప్రాంతమంతా వరదలతో మునిగిపోతుంది. అయినా.. ఏటా లక్షలాది మంది ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. 

3. గోల్డెన్ టెంపుల్- పంజాబ్

గోల్డెన్ టెంపుల్ గా ప్రసిద్ధి చెందినప్పటికీ దీనిని హర్మందిర్ సాహిబ్ లేదా దర్బార్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది సిక్కుల ఆరాధనా స్థలం. ఈ గోల్డెన్ టెంపుల్ పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉంది. ఈ ఆలయం గోడలు, గోపురం బంగారం పూతతో ఉంటాయి. దీనిని స్వర్ణ దేవాలయమని కూడా పిలుస్తారు. సిక్కుల ఐదో గురువు గురు అర్జన్ చే ఈ ఆలయం నిర్మించబడింది. భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. గురు నానక్ రచించిన గురు గ్రంథ్ సాహిబ్ ఈ ఆలయంలోనే ఉంది. గోల్డెన్ టెంపుల్ కున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ టెంపుల్ కు అన్ని మతాల ప్రజలు వస్తారు. ఎవరికీ ఎలాంటి ఆంక్షలు ఉండవు. 

4. శ్రీ పద్మనాభ స్వామి ఆలయం -కేరళ

రాష్ట్ర రాజధాని నగరం తిరువనంతపురంలో లేదా త్రివేండ్రం అని పిలువబడే శ్రీ పద్మనాభ స్వామి దేవాలయంలో అనంత లేదా పంచ తలల సర్పం మీద శయనించిన స్థితిలో విష్ణువు అద్భుతమైన విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహంలో త్రిమూర్తులు కనిపిస్తారు. ఎందుకంటే త్రిమూర్తుల్లో మూడో దేవుడు విష్ణువు స్వయంగా బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉన్న విగ్రహం నాభి నుంచి ఒక తామర ఉద్భవించడాన్ని చూడొచ్చు. అందుకే స్వామిని పద్మనాభుడు (పద్మ అంటే కమలం, నాభ అంటే నాభి) అని పిలుస్తారు. ఈ విగ్రహం కుడి అరచేతిలో శివ లింగం ఉద్భవిస్తుంది. ఈ ఆలయం దేశంలోని అత్యంత ముఖ్యమైన విష్ణు దేవాలయాలలో ఒకటి.

5. బద్రీనాథ్ ఆలయం - ఉత్తరాఖండ్

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైన చార్ ధామ్ లోని దేవాలయాలలో బద్రీనాథ్ ఆలయం ఒకటి. 10,170 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి ఎన్నో పర్వతాలను దాటాల్సి ఉంటుంది. 

6. ద్వారకాదిష్ ఆలయం -గుజరాత్

చార్ ధామ్ దేవాలయాలలో ఒకటైన ద్వారకాదిష్ ఆలయం భారతదేశంలోని అత్యంత పూజ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం 2500 ఏండ్లకు పైగా పురాతనమైనదని భావిస్తున్నారు. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో ఐదు అంతస్తులు ఉన్నాయి. ఈ ఆలయం పక్కనే గోమతి వాగు ప్రవహిస్తుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారాన్ని స్వర్గద్వారం లేదా స్వర్గానికి ద్వారం అని పిలుస్తారు. బయటకు వెళ్లే (నిష్క్రమణ) ద్వారాన్ని మోక్ష ద్వార్ లేదా ముక్తికి ద్వారం అని పిలుస్తారు. ప్రవేశ ద్వారానికి చేరుకోవడానికి 56 మెట్లు ఉన్నాయి. నల్ల పాలరాతితో దేవతా విగ్రహాన్నినిర్మించారు.  2.25 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది.  ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కృష్ణ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం ఉదయం, సాయంత్రం వేళల్లో తెరిచి ఉండి మధ్యాహ్నం మూసివేయబడి ఉంటుంది. 

7. అమర్ నాథ్ గుహ ఆలయం-జమ్మూ కాశ్మీర్

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ది పొందిన హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్ నాథ్ గుహ ఆలయం అద్భుతమైనది. ఇక్కడ శివలింగం మంచుతో దానంతట అదే ఏర్పడుతుంది. అలాగే పార్వతీ మాత, గణేశుడి రూపాలుగా భావించే రెండు చిన్న లింగాలు కూడా ఏర్పడతాయి. 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహ చుట్టూ మంచు పర్వతాలు ఉంటాయి. ఇది లిడ్డర్ లోయలో ఒక ఇరుకైన లోయలో ఉంటుంది. రాష్ట్ర రాజధాని శ్రీనగర్ నుంచి 141 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం జూన్ నుంచి ఆగస్టు వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైన అమర్ నాథ్ గుహ ఆలయాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఈ ఆలయం గురించిన ప్రస్తావన నీలమాత పురాణం, రాజతరంగిని వంటి పురాతన గ్రంథాలలో చూడొచ్చు.

8. తిరుపతి బాలాజీ ఆలయం- ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ తిరుపతికి కొలువుదీరిన వేంకటేశ్వర ఆలయం హిందు దేవాలాయాల్లో ఎంతో ప్రసిద్ది చెందింది. ఈ దేవాలయన్ని రోజూ కనీసం లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది భక్తులే సందర్శిస్తారని అంచనా. ఇది తిరుమల కొండలలో ఉంటుంది. సెప్టెంబర్ లో జరిగే  'బ్రహ్మోత్సవం' ఉత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. తలనీలాలు సమర్పించడం ఇక్కడ ఒక ఆచారం. అందుకే ఇక్కడకు వెళ్లిన పురుషులతో పాటుగా మహిళలు కూడా గుండును చేయించుకుంటారు. తిరుపతి లడ్డూలు చాలా ఫేమస్. 

9. సోమనాథ్ ఆలయం-గుజరాత్

భారతదేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో సోమనాథ్ ఆలయం కూడా ఒకటి. ఎందుకంటే ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. గుజరాత్ లోని సౌరాష్ట్రలో ఉన్న ఈ ఆలయం దేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి. పురాతన హిందూ గ్రంథాలలో సోమనాథ్ ఆలయం గురించి ప్రస్తావన ఉంటుంది. వివిధ దాడుల సమయంలో దెబ్బతిన్న తరువాత అనేకసార్లు పునర్నిర్మించబడినందున దీనిని 'పుణ్యక్షేత్రం ఎటర్నల్' అని కూడా పిలుస్తారు.

10. కాశీ విశ్వనాథ దేవాలయం-ఉత్తర ప్రదేశ్

భారతదేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కాశీ విశ్వనాథ ఆలయం ఒకటి. ఇది చాలా పురాతనమైంది కూడా. ఇందులో శివుడు ఉంటాడు. ఈ ఆలయం గంగానది ఒడ్డున నిర్మించబడింది.  ఇది ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలోని కాశీ నగరంలో ఉంది. ఇది దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అందుకే ఇది హిందువుకు ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. గంగానదిలో స్నానం చేసి శివుడిని దర్శించుకుంటే మోక్షాన్ని పొందుతారని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో 60 సెంటీమీటర్ల పొడవు, 90 సెంటీమీటర్ల వెడల్పుతో భారీ శివలింగం ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios