తక్కువ బడ్జెట్ లో హెవీ గా, స్టైలిష్ గా కనిపించే బంగారు గాజుల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము ఇచ్చిన డిజైన్లను ఎంపిక చేసుకుంటే ఈ బంగారు గాజులు తక్కువ ధరకే వస్తాయి. ఇవి చూసేందుకు ట్రెండీగా ఉంటాయి.
బంగారం అంటే భారతీయ స్త్రీలకు ఎంతో ఇష్టం. ఇయర్ రింగ్స్ నుంచి చేతి గాజుల వరకు అన్నీ బంగారంతో చేసినవే ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా గాజులు చేతులకు ఎంతో అందాన్ని ఇస్తాయి. గాజులు మీ లుక్ కి క్లాసీ టచ్ ని కూడా ఇస్తాయి. చాలా మంది తక్కువ ధరలో వచ్చే సింపుల్ బంగారు గాజులు కొనాలని భావిస్తారు. ఆ గాజులు లైట్ వెయిట్ అయినా కూడా చూడటానికి హెవీగా, స్టైలిష్ గా ఉండేలా ఎంపిక చేసుకోవాలి. పండగ సీజన్లో లేదా రోజువారీ వాడకానికి గాజులు వెతుకుతున్నట్లయితే ఇక్కడ మేము బంగారు గాజుల డిజైన్లను అందించాము.
లైట్ వెయిట్ బంగారు గాజులు
లైట్ వెయిట్ బంగారు గాజులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిపై చిన్న చిన్న కళాకృతులు ఉంటాయి. ఇవి తేలికగా ఉన్నప్పటికీ హెవీగా కనిపిస్తాయి. వీటిని పెళ్లి వంటి వేడుకలకు, రోజువారీ వాడకానికి కూడా ధరించవచ్చు. చూసేందుకు కూడా ఇవి ఎంతో అందంగా ఉంటాయి.

స్టోన్స్ పొదిగిన గాజులు
బంగారు గాజులలో చిన్న చిన్న స్టోన్స్ లేదా రూబీ, ఎమరాల్డ్ పొదిగి ఉన్నవి దొరుకుతాయి. ఈ స్టోన్స్ లైట్ లో మెరుస్తూ మీ చేతులకు మంచి లుక్ ని ఇస్తాయి. వీటిని మీరు పార్టీలకు లేదా కుటుంబ వేడుకలకు ధరించవచ్చు. ఇలా స్టోన్స్ పొదిగినవి తీసుకోవడం వల్ల బంగారం తక్కువ పడుతుంది. దీని వల్ల మీకు తక్కువ ధరలోనే ఇవి లభిస్తాయి.
ట్విస్టెడ్ డిజైన్ బంగారు గాజులు
ఇప్పుడు ట్విస్టెడ్ లేదా రోప్ ప్యాట్రన్ ఉన్న బంగారు గాజులు ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి సాధారణ గాజుల కంటే భిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిలో లైట్ వెయిట్ బంగారు గాజులు కూడా లభిస్తాయి. వాటి ప్యాట్రన్ చూసేందుకు ఎంతో హెవీగా కనిపిస్తాయి.

కుందన్, మీనాకారి గాజులు
సాంప్రదాయబద్ధమైన లుక్ ను ఇచ్చే గాజులు కావాలని కోరుకుంటే మీరు కుందన్ లేదా మీనాకారి డిజైన్స్ ని ఎంచుకోవచ్చు. ఇవి చూడటానికి చాలా క్లాసీగా, రాయల్ గా ఉంటాయి. ముఖ్యంగా పండగలు, పెళ్లిళ్లకు ఇవి అందాన్ని రెట్టింపు చేస్తాయి. చూసేందుకు కూడా ఇవి ఎంతో క్లాసీగా ఉంటాయి. ఇవి మహిళలకు నచ్చే డిజైన్లే.
మల్టీ-సెట్ చిన్న బంగారు గాజులు
చాలా మంది ఒకేసారి 6 నుంచి 8 చిన్న గాజులు ధరించడానికి ఇష్టపడతారు. ఇవన్నీ కలిసి హెవీ గాజుల లుక్ ని అందిస్తాయి. సన్నని బంగారు గాజులు కలిపి ఒకేసారి వేసుకుంటే నిండుగా కనిపిస్తాయి. మీరు మీ చేతులకు ఆధునిక, సాంప్రదాయ లుక్ ని అందిస్తాయి.
