Asianet News TeluguAsianet News Telugu

Work From Home: జాగ్రత్త.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఈ జబ్బులు వస్తున్నయ్..

Work From Home:  ఉద్యోగుల భద్రతను  దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు ఈ వర్క్ ఫ్రం హోమ్ Facility ని కల్పించాయి. దీనివల్ల కరోనా భారిన పడకుండా మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే ఈ Facility వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. నష్టాలు కూడా భారీగానే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

these mistakes can be a reason on weight gain during work from home
Author
Hyderabad, First Published Jan 12, 2022, 10:59 AM IST

Work From Home: కరోనా రాకతో నాటికీ.. నేటికీ.. ఉన్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయనే చెప్పుకోవాలి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకు తన విశ్వరూపాన్ని చూపిస్తూ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని దాటికి ఎంతో మందికి జీవనోపాధిలేకుండా పోయింది. మరికొంత మంది ఇంటి పట్టునే ఉండి తమ ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు.  అంటే వర్క్ ఫ్రం హోం అన్నమాట. ఉద్యోగుల భద్రతను  దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు ఈ వర్క్ ఫ్రం హోమ్ Facility ని కల్పించాయి. దీనివల్ల కరోనా భారిన పడకుండా మనల్ని మనం సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే ఈ Facility వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. నష్టాలు కూడా భారీగానే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ వర్క్ వల్ల ప్రజల జీవన శైలిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. soft పనికి పూర్తిగా అలవాటు పడి శారీరక శ్రమను తగ్గించేశారు. దీనిమూలంగా వాళ్లు అనేక రోగాల భారిన పడుతున్నారు. ఈ వ్యాధులలో ముఖ్యంగా మధుమేహం వ్యాధి,  థైరాయిడ్ సమస్య, అధిక చక్కెర వంటి రకరకాల వ్యాధుల భారిన పడుతున్నారట. వీటితో పాటుగా మరో డేంజర్ వ్యాధి భారిన కూడా పడుతున్నారట. అదే అందరినీ కలవరపరుస్తోంది. అదే ఊబకాయం సమస్య. దీనివల్ల అధికంగా బరువును పెరగడంతో పాటుగా మోకాళ్ల నొప్పులు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పారు. ఈ సమస్య రావడానికి మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే ఇందుకు కారణమవుతున్నాయి. అందుకు కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్యల నుంచి గట్టెకొచ్చు.

ఎక్కువ నీరు.. ఏ వ్యాధి నుంచి తప్పించుకోవాలన్నా నీళ్లు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. అందుకే డాక్టర్ల దగ్గరకి వెళ్లినప్పుడు తరచుగా నీళ్లు తాగుతున్నారా..? రోజు ఎన్ని లీటర్లు తాగుతున్నారు..? అని ప్రశ్నిస్తారు. ఎందుకంటే నీళ్లు తాగకపోతేనే సర్వ రోగాలు మన దరిచేరే అవకాశం ఉంది. అందుకని శరీరానికి నీళ్లు సరిపడా తాగాలని డాక్లర్లు సలహానిస్తారు. అలాగే బరువు తగ్గాలనుకున్న వారు కూడా ఎక్కువగా నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. ఇకపోతే వర్క్ ఫ్రం హోం చేసేవారు కూడా పనిలో పడి నీళ్లను తాగడమే మానేస్తారు. దీనివల్ల బరువు పెరిగే Chances ఉంది. అందుకని ఎంతపనిలో ఉన్నా నీళ్లను మరువకుండా తాగాలి.

అతినిద్ర అత్యంత ప్రమాదం.. మనిషికి నిద్ర చాలా అవసరం. రోజంతా Fresh గా Active గా ఉండాలంటే నిద్ర ఖచ్చితంగా అవసరం. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని చెబుతున్నారు. ఇన్ని గంటల నిద్ర ఉంటే మనిషి ఎలాంటి అనారోగ్య సమస్యల భారిన పడడని వెళ్లడిస్తున్నారు. కానీ చాలా మంది ఈ టైం ను పాటించకుండా అతిగా నిద్రిస్తున్నారు. అంటే 9 నుంచి 10 గంటలు నిద్రపోతున్నారన్న మాట. ఇది ఎక్కువగా వర్క్ హోం చేసేవాళ్లలోనే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పనివల్ల అలసిపోయి ఎంతసేపు పడుకున్నామో తెలియకుండా నిద్రిస్తున్నారట. ఇది ఊబకాయానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

నడవక పోవడం.. నడక ఆరోగ్యానిక ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఒక అర్ద గంట అయినా నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ నడిచే టైం ఓపిక లేని వారు ప్రస్తుతం చాలా మందే ఉన్నారు. అందులోనూ తిన్న వెంటనే ఒక 10 నిమిషాల పాటు మెల్లిగా నడవాలి. కానీ చాలా మంది తిన్న వెంటనే వర్క్ లో మునిగిపోతున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణం సరిగ్గా కాదు. ముఖ్యంగా ఇలా చేస్తే ఊబకాయం బారిన పడతారు. 

గంటల తరబడి కూర్చోవడం.. వర్క్ ఫ్రం హోం పుణ్యమా అని జనాలు నడవడమే పూర్తిగా మర్చిపోయారు. నడక ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ ఈ వర్క్ ఫ్రం హోం చేసే వారు గంటల తరబడి ఒకే చోట కూర్చుంటున్నారు. Work pressure వల్ల ఇలా సమయాన్ని మరిచి ఒకే దగ్గర కూర్చుంటున్నారు. కానీ ఇలా కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. వర్క్ మధ్య మధ్యలో కాసేపు నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా బ్రేక్ తీసుకోవడం వల్ల వర్క్ ను చురుగ్గా చేస్తారు. ఇలా చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా ఊబకాయం బారిన పడి బరువు పెరుగుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios