వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎండలు మండిపోతుంటాయి. స్నానం చేసిన పది నిమిషాలకే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. అందుకే ఈ కాలంలో చాలా మంది అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. కానీ.. ఎక్కువ శాతం పెళ్లిళ్లు.. శుభకార్యాలన్నీ ఈ వేసవిలోనే వచ్చిపడుతుంటాయి. అలాంటప్పుడు మేకప్ వేసుకోకూడండా బయటకు వెళ్లలేని పరిస్థితి.  తప్పక వేసుకుంటే.. చెమటకు కారిపోవడం, ప్యాచ్ లు ప్యాచ్ లుగా తయారవ్వడం జరుగుతంది. మరి అలా కాకుండా ఉండాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

మేకప్ వేసుకోవడానికి ముందు నాణ్యమైన క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల తొందరగా మేకప్ చెదిరిపోదు. ఒకవేళ క్లెన్సర్ అందుబాటులో లేకపోతే.. పచ్చిపాలల్లో శెనగపిండి కలిపి ముఖానికి రాసుకొని శుభ్రం చేసుకోవాలి.

ఎంతలేదన్నా,.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎండాకాలం ఉక్కపోత తప్పదు.  కాబట్టి.. నార్మల్ సీజన్ల మాదిరిగా కాకుండా ఈ కాలంలో కాస్త మేకప్ తక్కువ మందంగా వేసుకోవాలి.

ముఖం ఎక్కువ జిడ్డుగా ఉండే వారు మేకప్ కి ముందు ఆయిల్ ఫ్రీ ప్రైమర్ ని రాసుకోవాలి. తర్వాతే మేకప్ వేసుకోవాలి. లేదంటే వేసవి ఉక్కబోతకు ముఖం అంతా తెల్లగా ప్యాచ్‌లుగా కనిపిస్తుంది. 

కళ్లకి ప్రైమర్ వేశాక జిడ్డుగా అనిపిస్తే.. మ్యాటీ పౌడర్ అద్దాలి. ఇలా చేయడం వల్ల మేకప్ చాలా తాజాగా కనిపిస్తుంది. వాటర్ ప్రూఫ్ ఐలైనర్, షాడో, మస్కారా, అండర్ ఐ కన్సీలర్ లు వాడటం వల్ల ఐ మేకప్ ఎండకు కరగకుండా ఉంటుంది.

ఈ ఎండాకాలం లిప్ స్టిక్ కి బదులు లిప్ గ్లాస్ వాడటం చాలా మంచిది. అది కూడా ముందుగా లిప్ బామ్ రాసి.. ఆ తర్వాత లిప్ గ్లాస్ వేసుకుంటే బాగుంటుంది.

వేసవి కాలం కాబట్టి.. సన్ స్క్రీన్  లోషన్ వాడకం తప్పనిసరి. ఈ లోషన్ లో ఫౌండేషన్ క్రీమ్ కలిపి మేకప్ కి అరగంట ముందు రాసుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే.. ఎండాకాలంలో కూడా మేకప్ చెదిరిపోకుండా జాగ్రత్తపడొచ్చు.