teachers day 2023: ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న జరుపుకుంటారు. అయితే ఈ రోజున చాలా మంది స్పీచ్ ను టీచర్స్ డే గురించి స్పీచ్ ఇస్తుంటారు. ఒకవేల మీరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పై ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ఆయనకు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను మీ ప్రసంగంలో చేర్చాలి. ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడండి.
teachers day 2023: ప్రతీ ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడిది ముఖ్యమైన పాత్ర. ఉపాధ్యాయులే మనకు సన్మార్గం చూపిస్తారు. మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. ప్రతి విషయంలో అండగా ఉంటారు. గురువు నేర్పిన విద్యా బుద్దులే ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తెలుసుకెళ్తాయి. ఒక మనిషిని గొప్ప వాడిని చేస్తాయి. అందుకే ఉపాధ్యాయుల గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న టీచర్స్ డేను జరుపుకుంటారు. భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. వారికి నివాళిగా ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. స్కూళ్లు, కాలేజీలు సహా అన్ని కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు ఉపన్యాసం ఇస్తే.. మరికొందరు వ్యాస రచన తయారు చేస్తారు. అలాగే మరికొంత మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ రోజు మీరు ఉపన్యాసం ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నట్టైతే మీ కోసం కొన్ని టిప్స్ ఇక్కడ ఉన్నాయి. మీ స్పీచ్ లో ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జీవితంలో గురువు ప్రాముఖ్యత ఏమిటి? సెప్టెంబర్ 5నే ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు? విద్యను భోదించడం ఎ౦దుకంత ముఖ్యం? టీచర్స్ డే కు ఉన్న ప్రాముఖ్యత? వంటి విషయాలను గుర్తించుకోవాలి.
1. టీచర్స్ డే నాడు పైన ఇవ్వబడ్డ టాపిక్ ల్లో దేని గురించైనా మాట్లాడండి. అయితే మీరు ఇచ్చే స్పీచ్ చాలా సరళమైన, స్పష్టమైన పదాల్లో ఉండాలి. మీ మాటలు ప్రతి ఒక్కరికీ అర్థమవ్వాలి.
2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ఆయనకు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను మీ ప్రసంగంలో చేర్చండి. అవి వాస్తవాలతో కూడిన సమాచారమై ఉండాలి గుర్తుంచుకోండి.
3. అయితే మీ ప్రసంగం ప్రారంభంలో లేదా చివరలో, గురుబ్రహ్మ గురువిష్ణు: గురు ద్దేవో మహేశ్వర అనే మంత్రాన్ని అంటే కూడా బాగుంటుంది.