Asianet News TeluguAsianet News Telugu

టీచర్స్ డే కు స్పీచ్ లేదా వ్యాసరచనలో పాల్గొందామనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఇది..

ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ టీచర్స్ డే నాడే మన దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కూడా.. ఈ సందర్భంగా మీరు స్పీచ్ ను ఇవ్వాలనుకుంటే.. 

Teacher's Day 2022: Teacher's Day Speech in Telugu
Author
First Published Sep 2, 2022, 2:57 PM IST

ఇండియాలో గురువును దేవుడితో సమానంగా చూస్తారు. అందుకే అంటారు.. గుడి దేవాలయం అయితే.. అందులో చదువు చెప్పే ఉపాధ్యాయులే దేవుళ్లు అని.. దేశ భవిష్యత్తును నిర్మించడంలో పౌరేలే కీలకం..కానీ వారిని దేశం కోసం అన్ని రకాలుగా సిద్ధం చేసేది మాత్రం ఒక్క గురువులే. అందుకే అంటారు ఎన్ని చేసినా.. గురువుల రుణం మాత్రం తీర్చుకోలేమని.. నిజానికి మన ఎదుగుదలకు కన్న తల్లిదండ్రులు ఎంత చేస్తారో.. అంతకంటే ఎక్కువే గురువు చేస్తాడు. ఏది మంచి.. ఏది చెడు.. వంటి విషయాలను చెప్పి.. మనల్ని సరైన మార్గంలో నడిపించేందుకు అన్ని వేళలా మనతోనే ఉంటాడు. 

ఉపాధ్యాయులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ఆ రోజు పాఠశాలలు,  కళాశాలల్లో ప్రసంగ పోటీలు, వ్యాసరచన పోటీలు ఉంటాయి. మీరు కూడా స్పీచ్ ఇవ్వాలనుకుంటే కొన్ని ఐడియాలు ఇక్కడ ఉన్నాయి.. చదివేసేయండి.. 

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. విద్యార్థి మనసులో వాస్తవాలను బలవంతంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడు ఉపాధ్యాయుడు కాదని.. రేపటి సవాళ్లను ఎదుర్కొనేటట్టు విద్యార్థులను తయారుచేసేవారే నిజమైన ఉపాధ్యాయుడని దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు. దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసిద్ధ తత్వవేత్తే కాదు మంచి విద్యావేత్త కూడా. 

తమిళనాడులోని తిరుమణి అనే చిన్న గ్రామంలో 1888 సెప్టెంబర్ 5న జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 27 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆయనకు 1954లో భారతరత్న పురస్కారం కూడా లభించింది. ఉపాధ్యాయులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5 న అంటే వారి జయంతి రోజునే ఉపాధ్యాయ దినోత్సవాన్నిజరుపుకోవాలని నిశ్చయించిన గొప్ప వ్యక్తి. దేశ భవిష్యత్తుకు నిజమైన గుర్తింపు ఉపాధ్యాయులే అంటారు. ఎందుకంటే దేశ భవిష్యత్తు, దేశ అభివృద్ధి విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుంది. 

ఉపాధ్యాయులు మనకు బోధించడమే కాదు..  ఏది మంచి మార్గం.. ఏది చెడు వంటి విషయాలను చెప్పి.. సమాజంలో మనం మంచి వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తారు.  ఇక చివరిగా మరోసారి గురువులందరికీ నమస్కరిస్తున్నాను. మాలోని తప్పులను తొలగించి.. మమ్మల్ని మంచి వ్యక్తులుగా మార్చిన ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు.

Follow Us:
Download App:
  • android
  • ios