ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదనే సామేత వినే ఉంటారు. ఈ ఉల్లి మేలు.. కేవలం ఆరోగ్యానికే పరిమితం కాలేదు.. అందం కూడా తెచ్చిపెడుతుంది. చర్మ రక్షణకు అవసరమైన పోషకాలు బోలెడన్నీ ఉల్లిలో ఉన్నాయి. అందుకే.. ఉల్లిని ఉపయోగించి.. మీ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు.. ఎలాగో ఇప్పుడు చూద్దాం...

బ్లాక్ పిగ్మెంటేషన్ వల్ల చాలా మందికి ముఖం నల్లగా మారుతుంది. అంతేకాకుండా పొడిగా మారుతుంది. అలాంటప్పుడు ఉల్లిరసంలో కొద్దిగా శెనగపిండి, పాలమీద పెగడ కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చొప్పున.. నాలుగు వారాలు చేస్తే.. మంచి ఫలితం లభిస్తుంది.

చర్మం నీర్జవంగా మారి.. కళావిహీనంగా మారినవారు.. ఉల్లి రసాన్ని నేరుగా ముఖానికి రాసుకొని... కాసేపు ఆరనిచ్చి.. తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. కోల్పోయిన జీవాన్ని తిరిగి పొందుతుంది.

దోమలు, పురుగులు కుట్టడం వల్ల కొందరికి వాపులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఉల్లిరసాన్ని రాస్తే.. మంచి ఫలితం కనపడుతుంది.