సారాంశం

సుధామూర్తి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్యగా కోట్ల సంపదకు వారసురాలు. వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, పుస్తక రచయిత.. మొత్తానికి ఆమె బహుముఖ ప్రతిభావంతురాలు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆమె ఆచరించే జీవితం చాలా సింపుల్ గా, నలుగురికి ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది. 

సుధా మూర్తి: మన దేశంలో కోటీశ్వరులైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు కొదవ లేదు. వీళ్లంతా తమ లగ్జరీ లైఫ్‌కు బాగా ఫేమస్. వీళ్ల ఇళ్లు, కార్ల ధరలు, రోజువారీ ఖర్చులు చూస్తే సామాన్యులు షాక్ అవ్వాల్సిందే. కోట్లతో ఆడుకునే ఈ ధనవంతులు తమ లైఫ్‌స్టైల్ కోసం నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే, కొంతమంది కోటీశ్వరులు మాత్రం ఈ గ్లామరస్ లైఫ్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఇక్కడ మనం దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన కోటీశ్వరుల జంట గురించి తెలుసుకుందాం. వాళ్ల సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కోట్లాది రూపాయల ఆస్తులున్నా భార్యాభర్తలిద్దరూ సాధారణ ప్రజల్లాగే జీవిస్తారు. ఆమెను చూస్తే ఈమె కోటీశ్వరుడి భార్య అని ఎవరూ అనుకోరు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా.

మనం మాట్లాడుకుంటోంది సుధా మూర్తి (Sudha Murty) గురించి. ఈమె ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murty) భార్య. నారాయణ మూర్తి, సుధా మూర్తికి రూ.36,690 కోట్ల ఆస్తి ఉంది. కానీ, వాళ్లు సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతారు. ఆశ్చర్యం ఏంటంటే.. సుధా మూర్తి గత 30 ఏళ్లలో తన డబ్బుతో ఒక్క చీర కూడా కొనలేదట. దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. రూ.775 కోట్ల ఆస్తికి యజమానురాలైన సుధా మూర్తి ఎప్పుడూ సింపుల్ చీరలోనే కనిపిస్తారు.

ఆ ఒక్క నిర్ణయంతో చీర కొనలేదు సుధామూర్తి:
డీఎన్ఏ రిపోర్ట్ ప్రకారం సుధా మూర్తి మూడు దశాబ్దాల్లో ఒక్క కొత్త చీర కూడా కొనలేదు. కోట్లు ఆస్తి ఉన్నా ఇది ఆశ్చర్యకరమైన విషయమే. కానీ, దీని వెనుక ఆధ్యాత్మిక నమ్మకం ఉందని సుధా మూర్తి చెబుతారు. ఆమె కాశీకి వెళ్లినప్పుడు తనకు బాగా ఇష్టమైన ఒక వస్తువును వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం. అప్పటి నుంచి ఆమె కొత్త చీరలు కొనడం మానేశారు.

ఆమెకు చాలా చీరలు బహుమతులుగా వచ్చాయి:
సుధా మూర్తి భర్త నారాయణ మూర్తి కూడా సింపుల్ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు. ఫోర్బ్స్ ప్రకారం నారాయణ మూర్తి ఆస్తి  విలువ 4.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.36,690 కోట్లు). సుధా మూర్తి ఎక్కువగా తన సోదరీమణులు, బెస్ట్ ఫ్రెండ్స్, తాను సపోర్ట్ చేసే ఎన్జీవోలు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తారు. ఆమె ఇంత సక్సెస్ సాధించినప్పటికీ తన మూలాలను మాత్రం మర్చిపోలేదు.

నారాయణ మూర్తి, సుధా మూర్తి కూతురు అక్షత బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్‌ను పెళ్లి చేసుకున్నారు. 'నేను నా భర్తను సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌ను చేశాను. కానీ, నా కూతురు ఒక అడుగు ముందుకేసి తన భర్తను ప్రధానిని చేసింది' అని సుధా మూర్తి అన్నారు.