Asianet News TeluguAsianet News Telugu

గుండె ఆరోగ్యానికి మెట్లు చేసే మేలు..

గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తప్పని సరి. ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాగా ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి కూడా గుండెకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 

Stairs can be very useful for heart health
Author
Hyderabad, First Published Jan 17, 2022, 2:48 PM IST

గుండె పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తప్పని సరి. ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాగా ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి కూడా గుండెకు సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. 

కరోనా మహమ్మారి దారుణంగా వ్యాపిస్తోంది. ఈ కష్టకాలంలో ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది. అందుకే ప్రజలు ఎవరికి వారు సురక్షితంగా ఉండే అన్ని రకాల జాగ్రత్తలు తూ.చా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇందులో ఫిట్ నెస్ కోసమని, అనేక రోగాలు దరిచేరకుండా ఉండేందుకు ప్రతినిత్యం జిమ్ సెంటర్లకు వెళుతుంటారు చాలా మంది. వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్ సెంట్లర్లలో చెమటలు చిందించే వాళ్లు ప్రస్తుత కాలంలో చాలా మందే ఉన్నారు. కానీ కొవిడ్-19 వీళ్లకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. 

ఎందుకంటే కరోనా మహమ్మారి దారుణంగా విస్తరిస్తున్న వేళ చాలా మంది ఇంటికే పరిమితమవ్వాల్సి పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారు ఎక్కువగా మెట్లు ఎక్కే అలవాటును అలవర్చుకున్నారు. మెట్లు ఎక్కితే జిమ్ చేసినట్టు ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. దీన్ని అంత తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మెట్లు ఎక్కడం కూడా తీవ్రమైన వ్యాయామాలతో సమానమట. కెనడా అధ్యయనం ప్రకారం.. ఇతర వ్యాయామాలతో  సమానంగా మెట్లు ఎక్కడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తేల్చి చెప్పింది. 

అందులోనూ  Heart surgeries చేసుకున్న వాళ్ల  Exercises చేసే విధానాలను నిశితంగా Observe చేశారు. అయితే వీరిలో ఎవరైతే మెట్లు ఎక్కుతారో వారి గుండె పనితీరు మెరుగ్గా ఉన్నట్టు వెళ్లడించారు. అందులోనూ కండరాల పనితీరు, Lungs సామర్థ్యం మరింత పెరిగిందని నిపుణులు వెళ్లడించారు. ఇలా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకున్న వారిలో గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా.. దెబ్బతిన్న కండరాలు సైతం పునరుత్తేజం(Revival) అవుతున్నట్టు పేర్కొన్నారు. 

అంటే గుండె ఆరోగ్యంగా, సమర్థవంతంగా పనిచేయడానికి, సురక్షితంగా ఉండటానికి మెట్లు ఎక్కడం ఉత్తమమైన వ్యాయామంగా నిపుణులు భావిస్తున్నారు. కరోనా వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు వెళ్లలేని వారికి మెట్లు ఎక్కడం ఒక వ్యాయామంగా ఉపయోగపడుతుందని మెక్ డొనాల్డ్ అనే పరిశోధకులు వెళ్లడిస్తున్నారు. అయితే ఒక సారి హార్ట్ ఎటాక్ వచ్చిన వారిలో ఖచ్చితంగా రెండో సారికూడా వచ్చే అవకాశం ఉంది. దీని బారిన పడకుండా ఉండాలంటే మాత్రం మన జీవన శైలిలో మార్పులతో పాటుగా, వ్యాయామాలు కూడా చాలా అవసరం. వ్యాయామాలు చేయడానికి జిమ్ సెంటర్లు లేవనకుండా మెట్లు ఇలా ఉపయోగపడతాయి. మనసుంటే మార్గాలెన్నో ఉంటాయి. అందుకే ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రతి వస్తువును మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios