ఈ కూరగాయల తొక్కలు మిమ్మల్ని ఎంత అందంగా మారుస్తాయో..!
మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా చేయడానికి కూరగాయల తొక్కలు కూడా ఎంతో సహాయపడతాయంటున్నారు నిపుణులు. ఇన్నాళ్లు ఈ విషయం తెలియక కూరగాయల తొక్కలను డస్ట్ బిన్ లో వేశారు. ఇక నుంచి అలా అస్సలు చేయకండి.

చర్మం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మనం అనుకున్నంత సులువు కాదు చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవడం. అయినప్పటికీ మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతో చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా కూరగాయలతో. అవును అవసరం లేదనుకుని మనం పారేసే కూరగాయల తొక్కలతోనే చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటంటే..
బంగాళాదుంప తొక్క
బంగాళదుంప తొక్కల్లో విటమిన్ బి, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ తొక్క చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి, నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది. బంగాళాదుంప తొక్కల్లో పొటాషియం కూడా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బంగాళదుంప తొక్కను ప్రతిరోజూ ముఖానికి అప్లై చేసి కాసేపటి తర్వాత ముఖాన్ని కడిగేయాలి.
కీరదోసకాయ తొక్క
కీరదోసకాయలు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ కీరదోసకాయ తొక్క మంట, చర్మ ఎరుపును తగ్గించడానికి సహాయపడుతుంది. వీటిలో మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. కీరదోసకాయలో మన చర్మానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీంతో మీ చర్మం అందంగా మెరుస్తుంది.
క్యారెట్ తొక్కలు
క్యారెట్స్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి పర్యావరణ కాలుష్య ప్రభావాన్ని, అతినీలలోహిత కిరణాలతో పోరాడటానికి సహాయపడతాయి. క్యారెట్ తొక్కలు మీ చర్మాన్ని యవ్వనంగా, మరింత ప్రకాశవంతంగా చేస్తాయి. క్యారెట్లలో విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ యాంటీఆక్సిడెంట్లు. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. చర్మాన్ని బలోపేతం చేసే కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా విటమిన్ సి సహాయపడుతుంది.
గుమ్మడికాయ తొక్క
గుమ్మడికాయ తొక్కలలో సహజ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి. చర్మాన్ని మృదువుగా, అందంగా చేస్తుంది. వీటిలో జింక్, విటమిన్ ఎ, విటమిన్ సి లు ఉంటాయి. ఈ తొక్క చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.