కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్... తొలగించే సింపుల్ చిట్కా
అందంగా ఉండాలని... తమ అందరితో అందరినీ ఆకర్షించాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే.. ప్రస్తుత కాలంలో నిద్రేలమి, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల కంటి చుట్టూ బ్లాక్ సర్కిల్స్ ఎక్కువగా వస్తున్నాయి.
అందంగా ఉండాలని... తమ అందరితో అందరినీ ఆకర్షించాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే.. ప్రస్తుత కాలంలో నిద్రేలమి, పని ఒత్తిడి తదితర కారణాల వల్ల కంటి చుట్టూ బ్లాక్ సర్కిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. మార్కెట్ లో లభించే ఎన్ని రకాల క్రీములు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే.. కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో వాటిని పూర్తిగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
టమాట.. ఒక టీ స్పూన్ టమాటా రసం, మరో టీ స్పూన్ నిమ్మరసాన్ని ఒక గిన్నెల్ కలిపి, డార్క్ సర్కిల్స్ దగ్గర రాయండి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నిత్యం, టమాటా రసాన్ని తీసుకోవడం ద్వారా కూడా డార్క్ సర్కిళ్ల నుంచి ఉపశమనం పొందొచ్చు.
బంగాళదుంప.. కాస్త దూది తీసుకుని బంగాళా దుంపల రసంలో ముంచండి. కళ్లు మూసుకుని, ఆ దూదిని కళ్లపై పెట్టుకోండి. దూది, డార్క్ సర్కిళ్లు మొత్తం కవరయ్యేలా పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత వాటిని తీసేసి, కళ్లను శుభ్రం చేసుకోండి.
చల్లని టీ బ్యాగులు: టీ బ్యాగులను నీటిలో తడిపి, కాసేపు ఫ్రిజ్లో పెట్టండి. తర్వాత వాటిని మీ కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలపై పెట్టుకోండి. ఇలా రోజు చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
బాదం నూనె: బాదంలో విటమిన్-ఇ ఉంటుంది. బాదం నూనె చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను కళ్ల కింద నల్లటి వలయాలకు రాసి కాసేపు మర్దన చేయండి. రాత్రంతా అలాగే వదిలేసి, ఉదయం కళ్లను శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే వారంలో సత్ఫలితాలు కనిపిస్తాయి.
చల్లటి పాలు: చల్లటి పాలలో దూది ముంచి కళ్లపై పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత దూది తీసేసి, కళ్లను శుభ్రం చేసుకోండి.