నవరాత్రి తొమ్మిది రంగుల గురించి మీకు ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా..?
నవరాత్రి రంగులేంటో ప్రతి ఒక్కరికీ తెలుసు.. మరి ఈ రంగులు దేన్ని సూచిస్తున్నాయి.. వీటి ప్రాముఖ్యత ఏంటన్న సంగతి ఎంతమందికి తెలుసు?
నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇప్పటి నుంచి దుర్గాదేవిని తొమ్మిది రోజులు నిష్టగా పూజిస్తారు. అందులో దుర్గా దేవిని ఈ తొమ్మిది రోజులల్లో ఒక్కో రోజూ ఒక్కో రూపంలో కొలుస్తారు. అలాగే ఒక్కో రంగుల్లో అలంకరిస్తారు. ఇంతకీ రంగులు ప్రాముఖ్యత ఏంటి.? దుర్గాదేవిని ఈ తొమ్మిది రంగులతో అలంకరించడానికి కారణాలేంటో తెలుసుకుందాం పదంది.
1. ఆకుపచ్చ రంగు: కుశ్మద అవతారంలో ఉన్న అమ్మవారును ఆకుపచ్చరంగుతో అలంకరిస్తారు. కుశ్మందే ఈ లోకాన్ని పుట్టించదని ప్రజలు విశ్వసిస్తారు. ఈ దేవీ అనుగ్రహంతోనే ఈ ప్రపంచం పచ్చని చెట్లు, అడవులతో ఇంత అందంగా ఉందని భావిస్తారు. ఆకుపచ్చ రంగు కొత్త ప్రారంభాలు, సంపద, విజయం స్వభావాన్ని సూచిస్తుంది.
2. బూడిద రంగు: స్కందా మాత అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారిని బూడిద రంగుతో దుస్తులతో అలంకరిస్తారు. ఈ రంగు నిశ్చలమైన స్వభావాన్ని , భావోద్వేగ మానసిక స్థితికి, ప్రశాంతతకు, శక్తివంతమైన నిర్ణయం తీసుకునే స్వభావాన్ని తెలియజేస్తుంది.
3. గులాబీ: గులాబీ రంగు ప్రజల మధ్య దయ, ప్రేమ, సామరస్యం, ఆప్యాయతను సూచిస్తుంది. అందుకే దుర్గామాతకు పూజ చేసేటప్పుడు చాలా మంది వివిధ గులాబీ రంగు దుస్తులను వేసుకోవడానికి ఇష్టపడతారు.
4. నెమలి ఆకుపచ్చ: నెమలి ఆకుపచ్చ అలంకారంలో ఉన్న దుర్గామాత అందరి ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని ఆశీర్వదిస్తుంది. ఈ రంగు కరుణ, ప్రశాంతత, ప్రత్యేకత, వ్యక్తిత్వం భావాన్ని సూచిస్తుంది.
5. ఎరుపు రంగు అలంకారంలో ఉన్న దుర్గామాతను మొదటి రోజు పూజిస్తారు. ఈ రంగు చాలా శక్తివంతమైంది. ఈ రంగు ధైర్యానికి, అభిరుచికి, శక్తికి, ప్రేమ కు ప్రతీక. దుర్గామాత పూజ సమయంలో చాలా మంది ఈ ఎరుపు రంగు దుస్తులనే వేసుకుంటుంటారు.
6. నారింజ రంగు: దుర్గామాత కాత్యాయనీ అవతారంలో ఉన్నప్పుడు నారింజ రంగుతో అలంకరిస్తారు. ఈ నారింజ రంగు వెనుకు గొప్ప కథ ఉంది. అయితే ఈ రంగు సానుకూలత, ఉత్సాహం, ధైర్యానికి ప్రతీక. అందుకే నవరాత్రుల్లో ఎక్కువ మొత్తంలో ఈ రంగు దుస్తులనే వేసుకుంటుంటారు.
7. రాయల్ బ్లూ: ఈ రంగు ప్రశాంతతకు, గొప్పతనానికి, ప్రతీక. అందుకే ఈ రోజు దుర్గామాతను రాయల్ బ్లూ కలర్ రంగులో అలంకరిస్తారు. అలాగే ఆలయాన్ని రాయల్ బ్లూ రంగు పూలతో డెకరేట్ చేస్తారు.
8. తెలుపు: నవరాత్రుల్లో చాలా మంది వైట్ కలర్ దుస్తులనే ఎక్కువగా ధరిస్తారు. కాళరాత్రి అవతారంలో దుర్గామాతను తెలుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. ఈ రూపంలో దుర్గామాత దుష్టులను అంతంచేసే అవతారంలో భయానకంగా ఉంటుంది. ఈ రంగును శాంతికి, ప్రార్థనకు ప్రతీక.
9. పసుపు: చంద్రగంట అవతారంలో ఉన్నప్పుడు దుర్గామాతను పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. పసుపు రంగు ఈ పండుగ సీజన్‌లో ఆనందం, ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఈ రంగు ధైర్యానికి ప్రతీక.