Ear wax: చెవిలో ఉండే గులిమిని తీయడానికి చాలా మంది ఇయర్ బడ్స్ నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. దీనివల్ల చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Ear wax: మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవాల్లో చెవులు కూడా ఒకటి. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఎలాంటి చిన్న చిన్న శబ్దాలైనా వినగలుగుతాం. చెవి లోపలి భాగం విషయంలో మనం ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే తనకు తానుగా శ్రద్ధ తీసుకోగల సత్తా చెవికి ఉంటుంది. అయినా మన చేతులు ఊరుకుంటేనా. వీలున్నప్పుడల్లా చెవిలోపలికి జడ పిన్నులు, కాటన్ ఇయర్ బడ్స్ ను పెట్టి క్లీన్ చేస్తున్నాం అని అనుకుంటాం. క్లీన్ పేరుతో.. చెవిలో గులిమి ఉంటే మంచిది కాదని దాన్ని తీసేస్తేనే బాగా వినిపిస్తుందని అభిప్రాయ పడి చెవిలో ఏవేవో పెడుతుంటాం.
చెవి కెనాల్ లో గులిమి (Ear wax)ఉత్పత్తి అవుతుంది. ఈ గులిమిని మనం చెవిలో పుల్లలు పెట్టి ప్రత్యేకంగా తీయాల్సిన పని లేదు. చెవిలో గులిమి అవసరం లేదనుకుంటే Ear system యే దాన్ని బయటకు పంపిస్తుంది. దానికి మనం అయ్యో చెవిలో గులిమి ఉండే అని పిన్నీసులు, ఇయర్ బడ్స్ పెడితే చెవిలో బ్యాక్టీరియా చేరే ప్రమాదముంది. అందుకే దీనీ వాడకం తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు.
ఇయర్ బడ్స్ వాడకం అవసరమా?
Auto Clean Program మన DNA లో అంతర్లీనంగానే ఉంటుంది. ఇది మన చెవులకు కూడా వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. మీరే చెవిలో గులిమిని క్లీన్ చేయాల్సిన పని లేదు. వాటిని శుభ్రపరచనవసరమూ లేదు. చెవిలో గులిమి అవసరం లేదనుకుంటే గులమి చిన్న చిన్న పొరలుగా బయటకు పంపబడుతుంది. కాని కొన్ని కొన్ని సార్లు మాత్రం గులిమి చెవిలో గట్టిగా మారుతుంది. అలాంటి సమయాల్లో సొంత వైద్యం కాకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
ఇయర్ బడ్స్ వాడితే ఏమౌతుంది?
సన్నగా, పొడవుగా వుండే జడ పిన్నీసులు, అగ్గి పుల్లలు, కట్టె పుల్లలు వంటి వాటిని కూడా చెవిలో పెడుతుంటారు. ఇక వీటితో పాటుగా ఇయర్ బడ్స్ ను కూడా తెగ వాడేస్తుంటారు. అమెరికన్ డాక్టర్ ష్మెర్లింగ్ ప్రకారం.. చెవిలో వీటన్నింటినీ పెడితే చెవిలో ఉండే కెనాల్ లేదా ఇయర్ డ్రమ్ దెబ్బతినే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇలా చేస్తే తనకు తానుగా చెవి గులిమిని బయటకు పంపలేదని చెబుతున్నారు. ముఖ్యంగా వీటి వాడకం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్ రావొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇలా అయితే ఐసీలో చేరడం పక్కాగా జరుగుతుందని పేర్కంటున్నారు.
గులిమి అవసరమే..
చెవిలో గులిమి ఉంటే అపరిశుభ్రంగా ఉన్నామన్నట్టు కాదు. ఇది చెవిలో ఏర్పడటం సహజమే. ఇది చెవికి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గులితోనే చవిలోని స్కిన్ డ్రై గా మారకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ గులిమి వల్లే మన చెవి లోపలికి దుమ్ము, దూళి వంటివి చేరకుండా ఉంటాయి. ఈ గులిమిలో దుమ్ము దూళి, లోపల చనిపోయిన చర్మకణాలు ఉంటాయి. ముఖ్యంగా చెవి లోపలికి ఎటువంటి బ్యాక్టీరియా చొరబడకుండా కాపాడుతుంది. మన చెవిలో కొత్త గులిమి ఏర్పడగానే పాత గులిమిని ఆటోమెటిక్ గా బయటకు పంపుతుంది. కాబట్టి చెవిని క్లీన్ చేస్తున్నా అని అందులో అనవసరంగా పుల్లలు, ఇయర్స బడ్స్ పెట్టకండి.
